WTC Final- IPL 2025: ఇంగ్లాండ్ లోని లార్డ్స్ వేదికగా జూన్ 11-15 మధ్య ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. తుది పోరులో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. కాగా, దక్షిణాఫ్రికా 12 టెస్ట్‌ల్లో 8 విజయాలతో 69.44 పాయింట్లతో మొదటిస్థానంలో ఉండగా ఆస్ట్రేలియా 19 మ్యాచ్‌ల్లో 13 విజయాలతో 67.54 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి తుది ఫైనల్ కి అర్హత సాధించింది. ఈ కీలక మ్యాచ్ కోసం మే 13న ఉదయం ఆస్ట్రేలియా తమ తుది జట్టును ప్రకటించగా.. సాయంత్రం సఫారీ జట్టు కూడా టీమ్‌ను ప్రకటించింది. తెంబా బవుమా కెప్టెన్‌గా 15 మందితో కూడిన టీమ్‌ను ఎంపిక చేశారు. గాయం కారణంగా కొంతకాలంగా టెస్టులకు దూరమైన లుంగి ఎంగిడి తిరిగి తుది జట్టులోకి వచ్చాడు.
Read Also: Five Students Missing: కడపలో విషాదం.. ఈతకు వెళ్లి ఐదుగురు విద్యార్థులు గల్లంతు..!
అయితే, డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రభావం ఐపీఎల్‌పై పడబోతుంది. పలు జట్లు కీలక ప్లేయర్స్ సేవలను కోల్పోయే అవకాశం ఉంది. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం దక్షిణాఫ్రికా ప్రకటించిన 15 మంది ఆటగాళ్లలో ఎనిమిది మంది ప్రస్తుతం ఐపీఎల్‌లో కొనసాగుతున్నారు. ఎవరెవరంటే.. రికెల్‌టన్, కోర్బిన్ బాస్ (ముంబై), లుంగి ఎంగిడి (ఆర్సీబీ), ట్రిస్టన్ స్టబ్స్ (ఢిల్లీ), మార్కో యాన్సెన్ (పంజాబ్), ఐడెన్ మార్క్‌రమ్ (లక్నో), కగిసో రబాడ (గుజరాత్), వియాన్ ముల్డర్ (హైదరాబాద్). ఇక, ఆసీస్ డబ్ల్యూటీసీ జట్టులో ఉన్న కమిన్స్, ట్రావిస్ హెడ్ (హైదరాబాద్), హేజిల్‌వుడ్ (ఆర్సీబీ), జోష్ ఇంగ్లిస్ (పంజాబ్), మిచెల్ స్టార్క్ (ఢిల్లీ) ఐపీఎల్‌లో పలు జట్లు తరపున ఆడుతున్నారు. ఇందులో ముంబై, ఆర్సీబీ, ఢిల్లీ, లక్నో, పంజాబ్ జట్లకు ప్లే ఆఫ్స్ వెళ్లడానికి అవకాశాలు ఉన్నాయి. మరోవైపు, భారత్, పాక్ మధ్య ఉద్రికత్తలతో ఇప్పటికే చాలా మంది విదేశీ ప్లేయర్స్ స్వదేశానికి వెళ్లిపోయారు. ఒకవేళ వారు భారత్‌కు తిరిగి వచ్చినా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాల్సి ఉన్న ఆటగాళ్లు ఐపీఎల్‌లో తాము ప్రాతినిధ్యం వహించే టీమ్స్ ప్లే ఆఫ్స్‌కు చేరితే అందుబాటులో ఉండకపోవచ్చు.
Read Also: BJP: అస్సాం పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం..
ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, స్కాట్ బోలాండ్, కామెరూన్ గ్రీన్, అలెక్స్ కారీ, జోష్ హేజిల్‌వుడ్, జోష్ ఇంగ్లిస్, సామ్ కాన్‌స్టాస్, మ్యాట్ కునెమన్, నాథన్ లైయన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్.. ట్రావెలింగ్ రిజర్వ్: బ్రెండన్ డగెట్.
దక్షిణాఫ్రికా జట్టు: తెంబా బావుమా (కెప్టెన్), టోనీ డి జోర్జి, ఐడెన్ మార్క్‌రమ్, కేశవ్ మహరాజ్, వియాన్ ముల్డర్, మార్కో యాన్సెన్, కగిసో రబాడ, లుంగి ఎంగిడి, కోర్బిన్ బాష్, కైల్ వెరినే, డేవిడ్ బెడింగ్‌హామ్, ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్‌టన్. సెనురన్ ముత్తుసామి, డేన్ ప్యాటర్సన్.