ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కొత్త పోకడలు కనిపిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. ప్రత్యేకించి రాష్ట్రంలో ఇన్నాళ్లు పార్టీ పరిస్థితులకు భిన్నంగా... కనిపిస్తున్నాయని అంటున్నారు. ఎంత కూటమిలో ఉన్నా... అధికారం చెలాయిస్తున్నా... సొంత బలం ఉంటేనే గౌరవం అన్న నిర్ణయానికి వచ్చిన ఏపీ కాషాయదళం... ఆ దిశగా అడుగులేస్తోందట.
Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు మధ్యంతర బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Pemmasani Chandrasekhar: గండికోటను ఒక అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోని గండికోటకు సుమారు 78 కోట్ల పర్యాటక శాఖ నిధులను కేటాయించాం అని తెలిపారు.
Gadikota Srikanth Reddy: చంద్రబాబు పదహారేళ్ళ పాలనలో ఒక్క మెడికల్ కాలేజీ తెచ్చారా అని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. మీ హయంలోనే ఫ్యాక్షన్ క్రియేట్ చేశారు.. రాయలసీమలో వైఎస్ఆర్ ఫ్యాక్షన్ అరికట్టేందుకు కొత్త నేతలను తీసుకు వచ్చారు.. మీ దుష్ట శక్తుల సాయంతో జగన్ ను ఓడించినంత మాత్రాన మీరు సాధించింది ఏమీ లేదు.
YS Jagan: కృష్ణలంకలోని గల నిర్మలా శిశు భవన్ లో దివంగత వైఎస్ రాజారెడ్డి శత జయంతి వేడుకల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
రాజకీయ ముసుగులో ల్యాండ్, శాండ్, మైన్ దోచేశారు.. జే బ్రాండ్ తో నాసిరకం మద్యం అమ్మకాలు జరిపారు.. అలాగే, డ్రగ్స్, గంజాయితో యువత నిర్వీర్యమైపోయింది.. ఎవరైనా సరే గంజాయి, డ్రగ్స్ అమ్మితే వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. మా ఆడబిడ్డల జోలికి వస్తే ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండండి అని సీఎం చంద్రబాబు అన్నారు.
CM Chandrababu: జన సముద్రంతో కడప నిండిపోయింది అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంచి చేస్తే ప్రజలు అండగా ఉంటారని కడప ప్రజలు నిరూపించారు.. ఉదయం నుంచి అన్ని దారులు కడప వైపే చూస్తున్నాయి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జరిగిన మొదటి మహానాడు సూపర్ హిట్ అయింది..
Nara Lokesh: కడప జిల్లాలో నిర్వహిస్తున్న మహానాడు బహిరంగ సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. పౌరుషాల గడ్డపై టీడీపీ జెండా రెపరెపలాడుతోంది అన్నారు. 175 నియోజకవర్గాలకు గాను 164 సాధించాం ఇది ఆల్ టైం రికార్డ్ అని పేర్కొన్నారు. జెండా పీకేస్తాం అన్నారు.. ఇప్పుడు వాళ్ళ పార్టీ ఆఫీసుకు టూలేట్ బోర్డు పెట్టారని ఆరోపించారు.
JC Prabhakar Reddy: తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యాలు చేశారు. తాడిపత్రిలో తాజాగా, ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాను ప్రతిరోజూ.. తాడిపత్రిలో పర్యటిస్తున్నా.. కానీ, ప్రభుత్వ పథకాలు రావడం లేదని ప్రజలు మమ్మల్ని తిడుతున్నారని కామెంట్స్ చేశారు.