YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ముఖ్యమంత్రి చంద్రబాబు దిగజార్చటంపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. తన హయాం, చంద్రబాబు హయాంలోని పరిస్థితులను తెలుపుతూ ట్వీట్టర్ వేదికగా వివరాలను తెలియజేశారు.
KCR: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం కమిషన్ ఎదురుగా విచారణకు ఈ నెల 5వ తేదీన హాజరు కావడం లేదు అని స్పష్టం చేశారు. ఈ నెల 11వ తేదీన హాజరు కానున్నట్లు పేర్కొన్నారు.
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో గోశాలల అభివృద్ధి, నిర్వహణ, సంరక్షణపై కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, గోశాలల ఏర్పాటుకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేయాలని, నిర్ణీత గడువులోగా కమిటీ పూర్తిస్థాయి ప్రణాళికతో రావాలని సీఎం ఆదేశించారు.
Gulzar House Incident: గుల్జార్ హౌస్ బాధితుల ఆరోపణలపై అగ్నిమాపక శాఖ స్పందించింది. ఈ సందర్భంగా ఫైర్ డీఎఫ్ఓ వెంకన్న మాట్లాడుతూ.. మాకు ఫోన్ కాల్ వచ్చిన ఒకటిన్నర నిమిషంలో సంఘటన స్థలానికి చేరుకున్నాం.. ఫైర్ ఇంజన్లో పూర్తిస్థాయి అధునాతన పరికరాలు ఉన్నాయి.
IPL 2025 Final: ఐపీఎల్ 2025లో ఆర్సీబీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలి క్వాలిఫయర్‌లో పంజాబ్ కింగ్స్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ పోరుకు అడుగు దూరంలో నిలిచింది.
Congress Committees: తెలంగాణలో కాంగ్రెస్ కమిటీలకు ఏఐసీసీ ఆమోదం తెలిపింది. పొలిటికల్ అఫైర్స్ కమిటీ, అడ్వైజరీ కమిటీలకు ఏఐసీసీ ఆమోదం లభించింది. డీలిమిటేషన్, పీసీసీ క్రమశిక్షణ కమిటీలకు సైతం కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేల వ్యవహార శైలిపై విస్తృత చర్చ జరుగుతోంది. వాళ్ళని వెనక నుంచి ఎవరో నడిపిస్తున్నారని, లేందటే.. వాళ్ళు అంత తేలిగ్గా.. మంత్రి పదవి పేరుతో ముందుకు నడిచేవాళ్ళు కాదని మాట్లాడుకుంటున్నాయి పార్టీ వర్గాలు. మంత్రి పదవుల పంపకంలో సామాజిక న్యాయం పాటించాలని కోరుకోవడంలో తప్పు లేదు.
వి.హన్మంతరావు అలియాస్ వీహెచ్. కాంగ్రెస్‌లోనే కాదు, తెలంగాణలోనే కాదు, ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో సైతం ఆయనంటే తెలియని వారు ఉండరు. ఇంకా చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ కురువృద్ధుడాయన. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. తొలి నుంచి కాంగ్రెస్‌కు లాయల్‌గా ఉంటూ... అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారన్న పేరుంది.
వరంగల్ సబ్ డివిజన్ పరిధిలోని మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ జూపల్లి వెంకటరత్నం సస్పెండ్ అయ్యారు. ఆయన మీద వేటు వేస్తూ... వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. డిపార్ట్మెంట్లో అలాంటివి సాధారణంగా జరుగుతుంటాయి. కానీ, ఈ సస్పెన్షన్ మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే.. ఈ పోలీస్ స్టేషన్ ఇలాంటివి కామన్ అయిపోయాయి కాబట్టి.
గుంటూరు వెస్ట్.. రాజకీయంగా మంచి ప్రాధాన్యత ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్. కానీ... ఇక్కడ ఇన్ఛార్జ్ని నియమించుకోలేక సతమతం అవుతోందట వైసీపీ. అలాగని.... పార్టీకి ఇక్కడ నాయకుల కొరతేం లేదు