Ananthapuram: అనంతపురం జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న వినోద్ కుమార్ మారువేషంలో జిల్లాలో పర్యటించారు. ప్రజల సమస్యలను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే ఆయన ఈ పని చేశారు. ప్రజాసేవకు నూతన మార్గంగా జిల్లా కలెక్టర్ తీసుకున్న చర్యలతో.. అనంతపురం జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే, తాజాగా, కలెక్టర్ వినోద్ కుమార్ మారువేషంలో గుంతకల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో అర్థరాత్రి తనిఖీలు చేశారు.
Read Also: HariHara VeeraMallu: ఓజీ షూట్ అయ్యాక అర్ధరాత్రి వీరమల్లు డబ్బింగ్.. దటీజ్ పవన్ కళ్యాణ్
అయితే, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సామాన్యుడిలా గుంతకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో కలియతిరుగుతూ.. రోగుల యొక్క సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ముఖానికి మాస్క్, మెడలో టవల్ కప్పుకుని ప్రభుత్వ ఆసుపత్రి మొత్తాన్నీ పరిశీలించారు. ఆసుపత్రి బయట చెప్పులు విడిచి వెళ్లి.. రోగులు, ప్రభుత్వాసుపత్రి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ వినోద్ కుమార్.