CDS Anil Chauhan: ఆపరేషన్ సింధూర్పై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో నష్టం అనేది ముఖ్యం కాదు.. ఫలితమే ప్రధానం అన్నారు.
Sharmishta Panoli: పూణేకు చెందిన న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ పనోలీకు కోల్కతా హైకోర్టులో బిగ్ షాక్ తగిలింది. తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆమె చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.
IPL 2025 Final: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ముగింపు వేడుకలు ఈ రోజు (జూన్ 3న) సాయంత్రం 6:00 గంటలకు స్టార్ట్ కానున్నాయి. ఆపరేషన్ సింధూర్ విజయం నేపథ్యంలో ఇండియన్ ఆర్మీకి కృతజ్ఞతలు తెలుపుతూ బీసీసీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబోతుంది.
Military Basic Training: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, శారీరక వ్యాయామం లాంటి సద్గుణాలు పెంపొందించడానికి బేసిక్ మిలిటరీ శిక్షణ ఇస్తామని ఆ రాష్ట్ర ఎడ్యుకేషన్ మినిస్టర్ దాదా భూసే పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. రాజమండ్రి – కాకినాడ ఏడీబీ రోడ్డుపై వడిశలేరు దగ్గర చోటు చేసుకున్న ప్రమాదంలో ఐదుగురు చనిపోయారని తెలిసి చింతిస్తున్నాను.. ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరమైంది.. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను అన్నారు.
Nara Lokesh: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఎక్స్ (ట్విట్టర్) ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. మీరు చేసిన ఆరోపణలు నిరూపిస్తే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను అని వెల్లడించారు. మీరు చేసిన ఆరోపణలు తప్పని తేలితే రాష్ట్ర యువతకు క్షమాపణ చెప్పండి చాలు అని పేర్కొన్నారు.
Sajjala Ramakrishna Reddy: వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్ 4వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించదలచిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని కోరారు.
Minister Narayana: అమరావతి రాజధాని నిర్మాణానికి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మరో 40 వేల ఎకరాలు అవసరం అవుతుందని అధారిటీ సమావేశంలో నిర్ణయించాం అన్నారు మంత్రి నారాయణ. రైతుల అంగీకారాన్ని తీసుకుని ల్యాండ్ పుల్లింగ్ జరుగుతుందని తెలిపారు.
MLC Nagababu: ప్రమాదవశాత్తు మరణించిన 101 మంది జనసేన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు రూ. 5 కోట్ల 5 లక్షలు బీమా చెక్కులను ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ ఏం మాట్లాడాలో తెలియని సందర్భం.. ఇక్కడికి వచ్చిన చాలా మంది వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులను కోల్పోయి వచ్చిన వారే అన్నారు.