MLC Nagababu: ప్రమాదవశాత్తు మరణించిన 101 మంది జనసేన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు రూ. 5 కోట్ల 5 లక్షలు బీమా చెక్కులను ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ ఏం మాట్లాడాలో తెలియని సందర్భం.. ఇక్కడికి వచ్చిన చాలా మంది వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులను కోల్పోయి వచ్చిన వారే అన్నారు. వాళ్లకి కొంత ఆర్థిక భరోసా ఇవ్వగలిగామే గానీ.. వాళ్ళను వెనక్కి తిరిగి తీసుకురాలేమని పేర్కొన్నారు. అయినా గానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గొప్ప మనసుతో ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా వారికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు.. పవన్ కళ్యాణ్ ఎంతో స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు అని జనసేన ఎమ్మెల్సీ నాగబాబు చెప్పుకొచ్చారు.
Read Also: Double-Decker Buses: విశాఖలో డబుల్ డెక్కర్ బస్సులు.. పర్యాటక ప్రదేశాలను కవర్ చేసేలా ప్లాన్
అయితే, ఈ రోజు 5 కోట్ల రూపాయలకు పైగా చెక్కులు అందజేశామని ఎమ్మెల్సీ నాగబాబు తెలిపారు. మీ కుటుంబ సభ్యులను తీసుకు రాలేం.. కానీ, మీకు మేము ఉన్నామని భరోసాని ఇవ్వగలుగుతున్నాం అన్నారు. ఈ కార్యక్రమం చేయడం ద్వారా కొంచెం తృప్తిగా ఉంది.. మీ కుటుంబ సభ్యుల ఆత్మకు శాంతి కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని నాగబాబు అన్నారు.