లాస్ ఏంజిల్స్ లో శనివారం నుంచి అధికారులు ఇప్పటి వరకు సుమారు 400 మందిని అరెస్టు చేశారు. వీరిలో 330 మంది వలసదారులు ఉండగా, మరో 157 మందిని వారికి మద్దతు తెలిపినందుకు అదుపులోకి తీసుకున్నారు.
Body Found In Freezer: మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పెళ్లై రెండు వారాలు గడవక ముందే భర్తను భార్య దారుణంగా చంపించింది. ఈ ఘటన మరువక ముందే ఈశాన్య రాష్ట్రానికి చెందిన త్రిపురలో ఇలాంటి ఘటన మరోక్కటి జరగడంతో.. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతుంది.
High Tension In Podili: ప్రకాశం జిల్లాలోని పొదిలి పర్యటనలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలుగు మహిళల నిరసన సెగ తగిలింది. జగన్ గో బ్యాక్ అంటూ ప్లకార్డులు, నల్ల బ్యాడ్జీలతో టీడీపీ కార్యకర్తలు నిరసన చేశారు.
Nara Lokesh: ప్రకాశం జిల్లా పొదిలిలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలు, పోలీసులపై వైసీపీ సైకోల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను అని ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. మహిళలు, పోలీసులపై రాళ్ల దాడి చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు.
రాష్ట్రంలో ప్రభుత్వం రైతులను పట్టించుకునే పరిస్థితి లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని ఆరోపించారు. ఈ జిల్లాలో ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.. కొండపి, పర్చూరులో గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.. రైతాంగ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం.. ఏ రైతు చూసినా తక్కువ ధరలకు తమ పంటలను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వైఎస్ జగన్ మండిపడ్డారు.
Vangalapudi Anitha: అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేట నియోజకవర్గంలో హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. ఈ సందర్భంగా ఎస్.రాయవరం మండలం గెడ్డపాలెం గ్రామంలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏరువాక కార్యక్రమంలో భాగంగా భూమి పూజ చేసింది. కాడెడ్లతో నాగలి పట్టుకొని మంత్రి అనిత పొలం దున్నింది.
AP Govt: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి సర్కార్ ఏర్పాటై రేపటికి ఏడాది పూర్తి అవుతుంది. స్వపరిపాలన - స్వర్ణాంధ్ర ప్రదేశ్ పేరుతో అమరావతిలో రాష్ట్ర స్థాయి సభ ఏర్పాటుకు సన్నాహాలు కొనసాగుతున్నాయి.
BJP MP Laxman: ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టి 11 ఏళ్లు పూర్తి చేసుకున్నారు అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డా. కె లక్ష్మణ్ అన్నారు. అత్యంత పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి ప్రధాని మోడీ.. వరుసగా మూడోసారి ప్రధానిగా ఎన్నికవ్వడం దేశ చరిత్రలో నిలిచిపోతుందన్నారు.