High Tension In Podili: ప్రకాశం జిల్లాలోని పొదిలి పర్యటనలో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలుగు మహిళల నిరసన సెగ తగిలింది. జగన్ గో బ్యాక్ అంటూ ప్లకార్డులు, నల్ల బ్యాడ్జీలతో టీడీపీ కార్యకర్తలు నిరసన చేశారు. పొదిలిలోని బేస్తపాలెం దగ్గర జగన్ కాన్వాయ్ మీద నల్ల బెలూన్లు, చెప్పులను గుర్తు తెలియని మహిళలు విసిరారు.
Read Also: Nara Lokesh: పొదిలిలో వైసీపీ శ్రేణుల దాడి.. జగన్ క్షమాపణలు చెప్పాలని మంత్రి డిమాండ్
వైఎస్ జగన్ కాన్వాయ్ పైకి చెప్పులు, నల్ల బెలూన్లు విసరడంతో టీడీపీ, వైసీపీ మధ్య పరస్పరం దాడులు జరిగాయి. ఈ దాడిలో రాళ్లు, చెప్పులతో ఒకరిపై మరోకరు ఘర్షణకు పాల్పడ్డారు. ఈ గొడవలో పోలీస్ కానిస్టేబులకు గాయాలు అయ్యాయి. ఇక, రాళ్ల దాడిలో గాయపడ్డ కానిస్టేబుల్ ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. గొడవకు కారణమైన వారిని గుర్తించే పనిలో ఉన్నారు.