పశ్చిమాసియాలో మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ప్రపంచ దేశాల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఇరాన్ రాజధాని టెహ్రాన్పై ఇజ్రాయెల్ దాడులకు దిగింది. అయితే, ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదు.. దీనిపై ఆ దేశం చర్చలకు రావాల్సిందే.
Minister Thummala: ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధి కార్యక్రమాల కోసం కామంచికల్ రోడ్ కావాలని సత్యం కోరారు.. ఇందిరమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి హయాంలో అన్ని సంక్షేమ పథకాలు అందిస్తుంది.
బెదిరింపు కాల్ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయ లక్ష్మీకి వస్తే ఇమీడియట్ గా ఆ ఫోన్ చేసిన వ్యక్తికి అరెస్టు చేస్తారు.. కానీ, ఒక్క సిట్టింగ్ ఎమ్మెల్యేకి బక్రీదు పండగ కంటే ముందు నుంచి ఇప్పటి వరకు వందల ఫోన్ కాల్స్.. వేరే వేరే నంబర్ల నుంచి బెదిరింపు కాల్ వస్తే మాత్రం ఒక్క ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు ఆలోచన చేస్తున్న పోలీస్ అధికారులు అని మండిపడ్డారు.
యాదాద్రి ఆలయానికి వచ్చే భక్తుల్లో ఎక్కువ మంది ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక, ఈ క్రమంలో ఆలయ దేవస్థానం అధికారులు నరసింహస్వామి భక్తులకు షాక్ ఇచ్చారు. వ్రతం టికెట్ ధరను భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు.
Hyd Metro: హైదరాబాద్ మహా నగరంలో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మెట్రో రైలు రెండో దశ పనులకు అవరోధం ఎదురైంది. చారిత్రక చార్మినార్, ఫలక్నుమా ప్యాలెస్ సమీపంలో ఎలాంటి మెట్రో నిర్మాణ పనులు చేపట్టొ్ద్దని తెలంగాణ హైకోర్టు గురువారం నాడు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
Inter-Caste Marriage: మరో కులం వ్యక్తిని యువతి లవ్ మ్యారేజ్ చేసుకోగా.. ఊరి నుంచి వెలివేతను తప్పించుకోవడానికి ఆమె కుటుంబ సభ్యులు 40 మంది గుండు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిన అమానవీయ ఘటన ఒడిశాలో జరిగింది.
KTR: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం మాత్రమే కాదు అని కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్ ) మండిపడ్డారు. విద్యా వ్యవస్థ కూడా కుంటుపడింది.. వ్యవసాయ రంగం పట్ల నిబద్ధత లేదు అని పేర్కొన్నారు. విద్యావ్యవస్థ పట్ల బాధ్యత లేదు.. వానాకాలం సీజన్ మొదలవుతున్నా రైతు రోసా అమలు విషయంలో ప్రణాళిక లేదు అని ఆరోపించారు.