కృష్ణ, గోదావరి, పెన్నా , వంశధార నదులు ఉన్నాయి.. కృష్ణా నదికి నీళ్లు రాకపోయినా.. గోదావరి నుంచి బనకచర్ల ప్రాజెక్టుకు నీరు తెస్తే కరువు ఉండదు అని తేల్చి చెప్పారు. గోదావరి-బనకచర్ల నా సంకల్పం.. 554 టీఎంసీల నీళ్లు ఇప్పుడు నిలువ ఉన్నాయి.. రాబోయే రోజుల్లో 450 టీఎంసీల నీళ్లు వస్తే అన్ని జలాశయాలు కలకళలాడుతాయని చంద్రబాబు పేర్కొన్నారు.
అనిల్ కుమార్ మాట్లాడుతూ.. 200 మందికి పైగా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై పెద్ద పెద్ద మారణాయుధాలతో దాడి చేశారు అని ఆరోపించారు. ఆయన్నీ హతమార్చేందుకు ప్రయత్నం చేశారు.. ఇంట్లో ఉన్న ప్రసన్న తల్లి షాక్ కు గురై ఏదైనా అయ్యుంటే ఎవరిది బాధ్యత అన్నారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి, పార్లమెంటు సభ్యులు ప్రభాకర్ రెడ్డి, అనుచరుల పైనా హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
EX MLA Prasanna Kumar Reddy: కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. నెల్లూరులోని సావిత్రినగర్ లో ఆయన ఇంటిపై దాడి జరిగింది. ఇంట్లో ఫర్నిచర్ తో పాటు కారును పూర్తిగా ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు.
వైసీపీ అధినేత జగన్ వరుస పర్యటనలు వివాదాస్పదం అవుతున్నాయి. జిల్లాలకు వెళ్ళినప్పుడు మాజీ ముఖ్యమంత్రి స్థాయికి తగ్గ భద్రతను ప్రభుత్వం కల్పించటం లేదని ఆరోపిస్తున్నారు ఆ పార్టీ నేతలు.
గంటా శ్రీనివాసరావు....తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అవసరంలేని నాయకుడు. ఆయన పొలిటికల్ సక్సెస్ల సంగతి ఎలా ఉన్నా... ఏ ఎండకు ఆ గొడుగు పట్టేస్తారని మాత్రం గట్టిగా చెప్పుకుంటుంటాయి రాజకీయ వర్గాలు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో... ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మొత్తం 14 స్థానాలకు గాను 12 చోట్ల గెలిచింది కూటమి. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో గతంలో ఎప్పుడూ ఈ స్థాయి విజయం దక్కలేదు. అయినాసరే... ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు జిల్లా టీడీపీ ద్వితీయ శ్రేణికి మింగుడు పడటం లేదట. తోతాపురి మామిడికి గిట్టుబాటు ధర విషయంలో అంత రచ్చ జరుగుతున్నా.
తెలంగాణ కేబినెట్ విస్తరణలో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్కు ఛాన్స్ దక్కింది. అసెంబ్లీ ఎన్నికలకు పదిహేను రోజుల ముందు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయి బంపర్ ఆఫర్ కొట్టేశారాయన. ఆయన పరంగా చూస్తే... అంతా బాగానే ఉంది.
YS Jagan Mohan Reddy: చిత్తూరు జిల్లాలో ఈ నెల 9వ తేదీన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనకు పోలీసులు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు.
YS Jagan: కడప జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులకు చేరుకున్నారు. రేపు (జూలై 8న) దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించనున్నారు.
Srisailam Temple: నంద్యాల జిల్లాలోని శ్రీశైలంలో 25వ తేది నుంచి ఆగష్టు 24 వరకు శ్రావణా మాసోత్సవాలు జరగనున్నాయి. శ్రావణ మాసోత్సవాలపై దేవస్థానం అధికారులు, సిబ్బందితో ఆలయ ఈవో శ్రీనివాసరావు సమీక్ష సమావేశం నిర్వహించారు.