YS Jagan: కడప జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులకు చేరుకున్నారు. రేపు (జూలై 8న) దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించనున్నారు. ఈ రోజు రాత్రికి పులివెందులలోనే బస చేయనున్నారు జగన్. రేపు ఉదయం 6.45 గంటలకు పులివెందులలోని తన స్వగృహం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 7.30 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకుని.. 8.15 గంటల వరకు వైఎస్సార్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొంటారు.
Read Also: Purnea Murder Case: పూర్నియాలో మంత్రాల నెపంతో దారుణం.. ఒకే కుటుంబంలో ఐదుగురు సజీవదహనం..
అనంతరం రోడ్డు మార్గాన బయలుదేరి ఉదయం 8.45 గంటలకు పులివెందులలోని క్యాంప్ ఆఫీస్ కు చేరుకుంటారు వైఎస్ జగన్. రేపు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పులివెందుల క్యాంప్ ఆఫీస్ లో ప్రజలను కలుస్తారు. ఆ తర్వాత పులివెందుల నుంచి మధ్యాహ్నం 3.50 గంటలకు హెలికాఫ్టర్ లో బయలుదేరి సాయంత్రం 5.20 నిమిషాలకు బెంగళూరు చేరుకుంటారు. మరోవైపు, వైఎస్ షర్మిల, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేరువేరుగా తండ్రికి నివాళులు అర్పించనున్నారు.