YSRCP: అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. అయితే, ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డితో పాటు శైలజనాథ్, ఇతర వైసీపీ నాయకులు హజరయ్యారు. ఈ సందర్భంగా వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి జాగీర్ కాదు అని మండిపడ్డారు. తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ నాయకులను అడ్డుకుంటామంటే ఊరుకోము.. తాడిపత్రిలో ఎవరు ఉండాలో.. ఎవరు ఉండకూడదో ప్రభుత్వానికి జీవో జారీ చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. తాడిపత్రి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతి గడపకు తీసుకెళ్లి బలోపేతం చేస్తామన్నారు. టీడీపీ నాయకుల దౌర్జన్యాలను లెక్క పెడుతున్నాం.. పాలకులకు, వైసీపీకి మధ్య పోలీసులు ఉన్నారని అనంతపురం వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు.
Read Also: Tollywood : ఆ సినిమా ఇన్ సైడ్ టాక్ బాగుందట
మరోవైపు, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కోడలు రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమానికి రావడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ అనుచరులతో కలిసి వైసీపీ మీటింగ్ జరిగే ప్రదేశానికి బయలుదేరి వెళ్లారు.. అయితే, మీటింగ్ నుంచి పెద్దారెడ్డి కోడల్ని వెనక్కు పోలీసులు పంపించారు. మీటింగ్ జరిగే ప్రదేశానికి బయలుదేరిన జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకుని ఆయనకు నచ్చజెప్పారు. పోలీసుల జోక్యంతో తిరిగి తన ఇంటికి జేసీ ప్రభాకర్ రెడ్డి వచ్చేశారు.