Ballikurava Quarry Tragedy: బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలోని సత్య కృష్ణ గ్రానైట్ క్వారీలో అంచు విరిగి పడిన ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మృతులు ఒరిస్సాకు చెందిన కార్మికులుగా గుర్తించారు. పని చేస్తుండగా గ్రానైట్ అంచులు విరిగి పడ్డాయి. మరికొంత మంది కార్మికులకు గాయాలు కాగా.. గాయపడిన వారిని నర్సరావుపేటలోని ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో క్వారీలో 15 మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు. క్వారీ యాజమాన్యం నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
Read Also: Coolie: మొత్తనికి సత్యరాజ్‌తో విభేదాలపై స్పందించిన రజనీకాంత్..
ఇక, బల్లికురవ క్వారీ ప్రమాద ఘటనలో ఐదుగురు మృతి చెందడంతో పాటు మరి కొంత మంది తీవ్రంగా గాయపడిన ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ఇంత మంది ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంపై అధికారులతో మాట్లాడి, వివరాలను సేకరించిన సీఎం.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
Read Also: LIC Bima Sakhi: మహిళల కోసం ఎల్ఐసీ గొప్ప పథకం.. ఒక్క రూపాయి కట్టకుండానే.. నెలకు రూ. 7000 పొందే ఛాన్స్
మరోవైపు, బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలోని గ్రానైట్ క్వారీలో బండరాళ్లు పడి పలువురు కార్మికులు దుర్మరణం పాలవడం నన్ను తీవ్రంగా కలచివేసింది అని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో రోజువారీ కూలీలు మృతి చెందడం బాధాకరం.. గాయపడిన వారికి అవసరమైన వైద్యసాయం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించడం జరిగింది.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని నారా లోకేష్ వెల్లడించారు.