ఒకే నేమ్‌తో ఉన్న ఇద్దరు స్టార్ కిడ్స్ ఒకే సినిమాతో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత హీరోలుగా నిలదొక్కుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వాళ్లు మొదలుపెట్టారు. హీరోలుగా ఇంట్రడ్యూసయ్యారు. కానీ వారి ఫస్ట్ ఫిల్మ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. నెక్ట్స్ తమ సెకండ్ ఫిల్మ్స్‌తో లక్ టెస్టుకు రెడీ అయ్యారు. వారే హీరో కుమారుడు శ్రీకాంత్ రోషన్, రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాల. వీరి తెరంగేట్రం ఈజీగానే జరిగిపోయింది కానీ హీరోలుగా సాలిడ్ […]
స్టార్డమ్ సంపాదించాలంటే తప్పనిసరిగా ‘మాస్ ఇమేజ్’ ఉండాలన్న పాత ఫార్ములాను నేటి యువ హీరోలు పక్కన పెడుతున్నారు. మాస్ హీరో అనిపించుకోవడం కంటే, ‘సక్సెస్’ వస్తే చాలు అనే కొత్త మానియాతో వీరు విభిన్నమైన కథలను ఎంచుకుంటున్నారు. యువ హీరోల టీజర్స్, ట్రైలర్స్ పరిశీలిస్తే, ఒకరిద్దరు మినహా చాలామంది మాస్ ఇమేజ్‌కు దూరంగా, కొత్త ప్రయోగాలు చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. గతంలో, యాక్షన్ హీరోలుగా ప్రయత్నించి ఫెయిల్ అయిన లేదా రొటీన్ ట్రాక్‌లో ఇరుక్కున్న యువ హీరోలు […]
సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నింటిలో నటిస్తూ, ప్రస్తుతం తొమ్మిది సినిమాలతో క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్న హీరోయిన్ సంయుక్త మీనన్ త్వరలో ఫేడౌట్ అవుతుందనే చర్చ ఫిల్మ్ ఇండస్ట్రీలో మొదలైంది. ఒకవైపు చేతినిండా సినిమాలు ఉన్నప్పటికీ, కెరీర్ మసకబారుతుందా అన్న భయం ఈ అమ్మడిని వెంటాడుతోంది. ఈ విచిత్రమైన పరిస్థితులకు కారణం ఏమిటి? సాయి పల్లవి, నిత్యా మీనన్ తరహాలో ఇంతకాలం గ్లామర్‌కు దూరంగా, నటనకు ప్రాధాన్యత ఇచ్చే పాత్రలు ఎంచుకున్నారు సంయుక్త. ‘సార్’ (తెలుగులో […]
యంగ్ హీరో తిరువీర్, టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కలిసి ఒక హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. తిరువీర్ ‘ప్రీ వెడ్డింగ్ షో’, ఐశ్వర్య రాజేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలతో విజయాలు అందుకున్న నేపథ్యంలో, వీరిద్దరి కాంబినేషన్ ఈ సినిమాపై అంచనాలను పెంచుతోంది. గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై, రూపొందిస్తున్న రెండవ చిత్రమిది. మహేశ్వర రెడ్డి మూలి నిర్మాతగా, నూతన దర్శకుడు భరత్ దర్శన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈరోజు మేకర్స్ ఈ సినిమా టైటిల్‌ను *’ఓ..! సుకుమారి’*గా […]
యంగ్ హీరో విరాట్ కర్ణ నటిస్తున్న పాన్-ఇండియా ఎపిక్ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘నాగబంధం’ ప్రస్తుతం అద్భుతమైన విజువల్ ఫీస్ట్‌గా రూపుదిద్దుకుంటోంది. అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది కేవలం సినిమాటిక్ వండర్‌గా మాత్రమే కాక, డివైన్ మరియు యాక్షన్‌తో కూడిన భారీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ‘నాగబంధం’ టీమ్ హైదరాబాద్‌లోని నానక్‌రామగూడలో ఉన్న రామానాయుడు స్టూడియోస్‌లో గూస్బమ్స్ తెప్పించే క్లైమాక్స్ సీక్వెన్స్‌ను […]
సిల్వర్ స్క్రీన్‌పై తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న యువ నటి హేమ పోతన చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయారు. 2013లో మిస్ హైదరాబాద్ కిరీటం హేమ సినీ ప్రయాణానికి పునాది వేసింది. సినిమాలపై మక్కువతో టాలీవుడ్లో అడుగుపెట్టిన హేమ, తన నటన ప్రతిభను పలు చిత్రాల్లో చాటుకున్నారు. ఆమె నటించిన సినిమాలలో 100% లవ్, చలాకీ, కాఫీబార్, రాజ్ వంటివి ఉన్నాయి. ప్రొఫెషనల్ జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో, జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం […]
సినిమా ప్రమోషన్స్‌లో టాలీవుడ్లో ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. సీనియర్ డైరెక్టర్ అయినా, జూనియర్ అయినా… అందరూ ఇప్పుడు దర్శకుడు అనిల్ రావిపూడి వేసిన దారిలోనే నడుస్తున్నారు. ఈ విషయంలో ప్రమోషన్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా అనిల్ రావిపూడి నిలిచారు. తాజాగా, దర్శకుడు హరీష్ శంకర్ కూడా అనిల్‌ను అనుసరిస్తున్నారు. అనిల్ రావిపూడి తన సినిమాలలో హీరోలకు సంబంధించిన చిన్న అప్డేట్లు, ముఖ్యంగా సినిమా సెట్స్‌లో ఏం జరుగుతుందో చూపిస్తూ రకరకాల ప్రమోషన్స్ చేయడం అలవాటు చేసుకున్నారు. ఈ […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తెలుగు దర్శకులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే చర్చ ఫిల్మ్ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. పాన్ ఇండియా హీరోగా ఆయనకు క్రేజ్ రావడంలో తెలుగు దర్శకుల పాత్ర ఉన్నప్పటికీ, బన్నీ ఇప్పుడు కేవలం ఇతర భాషల దర్శకులు చెప్పిన కథల మీదే దృష్టి పెడుతున్నారని తెలుస్తోంది. ‘పుష్ప 2’ బ్లాక్‌బస్టర్ తర్వాత అల్లు అర్జున్ మైండ్‌సెట్ పూర్తిగా మారిపోయిందని అంటున్నారు. ఆయన ఇప్పుడు ‘అద్భుతం సృష్టించాలన్న’ ఆలోచనలో ఉన్నారు. ఇదే నేపథ్యంలో, […]
సంక్రాంతి తెలుగు సినిమాలకు ఒక పెద్ద సీజన్. ఆ సమయంలో మూడు, నాలుగు సినిమాలను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. బావుంటే అవన్నీ కూడా హిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే, ఇప్పటికే తెలుగులో రెండు పెద్ద సినిమాలు సంక్రాంతికి కర్చీఫ్ వేసుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారి సినిమాతో పాటుగా, ప్రభాస్ రాజా సాబ్ సినిమా ఇప్పటికే సంక్రాంతికి ఫిక్స్ చేసుకున్నారు. వీరితో పాటు రవితేజ సినిమాతో పాటు, […]
నటి సమంత రాజ్ నిడుమోరు అనే దర్శకుడిని రెండవ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, వీరి వివాహం అనంతరం, ఈ వివాహం నేపథ్యంలో వారికి చాలామంది శుభాకాంక్షలు తెలియజేస్తుంటే, కొంతమంది మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. అందులో ముఖ్యంగా, సమంతకు గతంలో వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్‌గా వ్యవహరించిన సాధనా సింగ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక స్టేటస్ వైరల్ అయింది. అందులో ఆమె “అసలైన నేరస్థుడే బాధితుడు అన్నట్టు కలరిచ్చి, ఇప్పుడు తన నిజస్వరూపం బయటపెట్టాడు” […]