శృతిహాసన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కమల్ హాసన్ కుమార్తెగా సినీ ప్రపంచానికి పరిచయమైన ఆమె తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. మధ్యలో ప్రేమ వ్యవహారం నడిపి సినీ పరిశ్రమకు పూర్తిగా దూరమైన ఆమె ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో బిజీ అయింది. చివరిగా ఆమె ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సీజ్ ఫైర్ పార్ట్ వన్ లో కనిపించింది. తర్వాత అడివి శేష్ హీరోగా నటిస్తున్న డెకరేట్ సినిమాలో నటించాల్సి […]
తెలుగు హీరోలలో రామ్ చరణ్ తేజ ప్రతి ఏడాది అయ్యప్ప మాల ధరిస్తాడు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది కూడా ఆయన అయ్యప్ప మాల ధారణ చేశారు. ఆయన చేసిన గేమ్ చేంజర్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మునుపెన్నడూ లేని విధంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అమెరికాలో డిసెంబర్ […]
2024లో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో అంచనాలతో విడుదలైన కొన్ని సినిమాలు విడుదలలు బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపడంలో విఫలమయ్యాయి. పెద్ద స్టార్స్, భారీ బడ్జెట్ ఉన్నప్పటికీ, ఆపరేషన్ వాలెంటైన్, ఫ్యామిలీ స్టార్, డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ వంటి చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో చాలా కష్టపడ్డాయి. దీంతో ఒకరకంగా 2024 టాలీవుడ్‌కు సవాలుగా మారింది. అలంటి సినిమాలు ఏమేం ఉన్నాయో ఒక లుక్ వేద్దాం పడండి. మిస్టర్ బచ్చన్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన తెలుగు […]
రెబల్ స్టార్, గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న ప్రభాస్ గాయపడినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం షూటింగ్లో ప్రభాస్ చీలమండ దగ్గర గాయం అయినట్లు పేర్కొన్నారు. ఆ కారణంగా జపాన్ లో రిలీజ్ అయ్యే కల్కి 2989 ఏడీ సినిమా ప్రమోషన్స్ కి తాను అటెండ్ కాలేకపోతున్నానని ప్రభాస్ తెలిపారు. గాయం నుండి త్వరలోనే కోలుకుని తిరిగి షూటింగ్ లో పాల్గొంటానని కూడా ఆయన తెలిపారు. […]
ఇళయరాజా తమిళ చిత్ర పరిశ్రమలో కాకుండా భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కూడా సంగీత దిగ్గజం. తరచూ వివాదాస్పదంగా మాట్లాడుతూ ఆయన వార్తల్లోకి ఎక్కుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఇళయరాజాకి జరిగిన ఓ సంఘటన ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూరులోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆండాళ్ ఆలయ గర్భగుడిలోకి వెళ్లకుండా సంగీత స్వరకర్త ఇళయరాజా ఆపి గర్భగుడి బయట నిలబెట్టిన ఘటన జనాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. తమిళనాడు ప్రభుత్వ చిహ్నమైన రాజ గోపురం ఉన్న […]
మోహన్ బాబు ఫ్యామిలీ వివాదంపై రాచకొండ సిపి స్పందించారు. ఇప్పటికే మంచు కుటుంబం పై 3 ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయి అని అన్నారు. వాటిపై ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని పేర్కొన్న ఆయన లీగల్ గా మేము ఏమి చేయాలో అది చేస్తామని అన్నారు. మోహన్ బాబుకు ఇప్పటికే నోటీసులు ఇచ్చామని, 24 వరకు టైం అడిగారని అన్నారు. కోర్టు టైం ఇచ్చింది కాబట్టి మేము అరెస్ట్ చేయలేదని పేర్కొన్నారు. మోహన్ బాబు విచారణ పై మేము కూడా […]
ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద ఈ నెల 4వ తేదీ రాత్రి పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. బాలుడు తీవ్రంగా గాయపడి హాస్పటల్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సినీ నటుడు అల్లు అర్జున్‌తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యంపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. Pranaya Godari: ఎలాంటి రివ్యూలు […]
సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్గా తెరకెక్కిన ‘ప్రణయ గోదారి’ చిత్రం డిసెంబర్ 13న రిలీజ్ అయింది. పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో రూపొందిన ‘ప్రణయ గోదారి’ మూవీని పిఎల్‌వి క్రియేషన్స్‌పై పారమళ్ళ లింగయ్య నిర్మించారు. తాజాగా ఆడియెన్స్‌కు, మీడియాకు థాంక్స్ చెప్పేందుకు ప్రణయగోదారి టీం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు విఘ్నేశ్ మాట్లాడుతూ.. ‘చిన్న చిత్రమైనా పెద్ద హిట్ అందించిన ఆడియెన్స్, మీడియాకి థాంక్స్. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ టీంను అభినందించారు. విజువల్స్, […]
ఆర్కే నాయుడుగా ఒక తెలుగులో రేంజ్ గుర్తింపు తెచ్చుకున్న సాగర్ నటించిన ‘ది 100’ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లర్‌గా ఓంకార్ శశిధర్ దర్శత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలకు ముందే పలు పురస్కారాలను సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలకు ముందే పలు ప్రతిష్ఠాత్మక అవార్డులను సొంతం చేసుకోగా తాజాగా ఈ సినిమా దర్శకుడు ఓంకార్ శశిధర్ తన గురువు కృష్ణ వంశీ గురించి పెట్టిన పోస్టు వైరల్ […]
నటి నయనతార భర్త విఘ్నేష్ శివన్ పాండిచ్చేరిలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న హోటల్ కావాలని కోరిన వివాదంపై వివరణ ఇచ్చారు. నటి నయనతార భర్త విఘ్నేష్ శివన్ తమిళంలో ఎన్నో హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన తదుపరి చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ టైటిల్‌తో సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో కృతి శెట్టి, సీమాన్, కెలారి కిషన్ కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీని సెవెన్ […]