2024లో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో అంచనాలతో విడుదలైన కొన్ని సినిమాలు విడుదలలు బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపడంలో విఫలమయ్యాయి. పెద్ద స్టార్స్, భారీ బడ్జెట్ ఉన్నప్పటికీ, ఆపరేషన్ వాలెంటైన్, ఫ్యామిలీ స్టార్, డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ వంటి చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో చాలా కష్టపడ్డాయి. దీంతో ఒకరకంగా 2024 టాలీవుడ్‌కు సవాలుగా మారింది. అలంటి సినిమాలు ఏమేం ఉన్నాయో ఒక లుక్ వేద్దాం పడండి.
మిస్టర్ బచ్చన్
హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన తెలుగు రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం మిస్టర్ బచ్చన్. ఈ చిత్రంలో రవితేజ – భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రలలో నటించారు. జగపతి బాబు, సచిన్ ఖేడేకర్, సత్యం రాజేష్, ఝాన్సీ, తనికెళ్ళ భరణి, సత్య, నాగ మహేష్, చమ్మక్ చంద్ర సహా పలువురు ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జె మేయర్ అందించగా, సినిమాటోగ్రఫీ అయనంక బోస్ అందించారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు.
డబుల్ ఇస్మార్ట్
డబుల్ ఇస్మార్ట్ పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. ఈ చిత్రంలో రామ్ పోతినేని, సంజయ్ దత్, కావ్య థాపర్ మరియు బన్ని జె ప్రధాన పాత్రలలో నటించారు. అలీ, గెటప్ శ్రీను, సాయాజీ షిండే, మకరంద్ దేశ్‌పాండే, టెంపర్ వంశీ మరియు పలువురు ఇతర ముఖ్య పాత్రలలో కనిపించారు. మణిశర్మ సంగీతం సమకూర్చగా, సామ్ కె నాయుడు, జియాని జియానెల్లి సినిమాటోగ్రఫీని అందించారు. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ నిర్మించారు.
ఆపరేషన్ వాలెంటైన్
ఆపరేషన్ వాలెంటైన్ శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మరియు రెనైసెన్స్ పిక్చర్స్ బ్యానర్లు నిర్మించాయి. వరుణ్ తేజ్ ఈ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో సినిమా తెరకెక్కించారు.
మనమే
మనమే శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన తెలుగు రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా చిత్రం. ఈ చిత్రంలో శర్వానంద్ మరియు కృతి శెట్టి ప్రధాన పాత్రలు పోషించగా, విక్రమ్ ఆదిత్య, సీరత్ కపూర్, అయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రవీంద్ర, రాహుల్ రామకృష్ణ, శివ కందుకూరి, సుదర్శన్ మరియు పలువురు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం సమకూర్చగా, విష్ణు శర్మ సినిమాటోగ్రఫీని అందించగా, ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఫ్యామిలీ స్టార్
పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ మూవీ ఫ్యామిలీ స్టార్. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలు పోషించారు. గోపి సుందర్ సంగీతం సమకూర్చగా, కెయు మోహనన్ సినిమాటోగ్రఫీ అందించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, వాసు వర్మ, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో
అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన తెలుగు రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం. ఈ చిత్రంలో నిఖిల్ సిద్ధార్థ్ మరియు రుక్మిణి వసంత్ ప్రధాన పాత్రలలో నటించారు, అజయ్, జాన్ విజయ్, వైవా హర్ష, సత్య, సుదర్శన్ మరియు పలువురు ఇతర ముఖ్య పాత్రలలో కనిపించారు. ఈ పాటలను కార్తీక్ స్వరపరచగా, సన్నీ ఎంఆర్ నేపథ్య సంగీతం అందించగా, రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించగా, నవీన్ నూలి ఎడిటింగ్ చేశారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివిఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
లవ్ మీ
లవ్ మీ – ఇఫ్ యు డేర్ అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించిన తెలుగు రొమాంటిక్ చిత్రం. ఈ చిత్రంలో ఆశిష్ మరియు వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలు పోషించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షితారెడ్డి, నాగ మల్లిడి ఈ చిత్రాన్ని నిర్మించారు.