తెలుగు హీరోలలో రామ్ చరణ్ తేజ ప్రతి ఏడాది అయ్యప్ప మాల ధరిస్తాడు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది కూడా ఆయన అయ్యప్ప మాల ధారణ చేశారు. ఆయన చేసిన గేమ్ చేంజర్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మునుపెన్నడూ లేని విధంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని అమెరికాలో డిసెంబర్ 21వ తేదీన నిర్వహించేందుకు సిద్ధం చేశారు. డల్లాస్ నగరంలో ఈ ఈవెంట్ జరగనుండగా ఈ ఈవెంట్ కోసం రామ్ చరణ్ తేజ అమెరికా వెళ్ళబోతున్నారు. రామ్ చరణ్ తేజ్ తో పాటు ఈ సినిమా నిర్మాత దిల్ రాజు తో, దర్శకుడు శంకర్, ఎస్.జే సూర్య వంటి వారు కూడా అక్కడికి వెళ్ళబోతున్నారు.
Tollywood Rewind 2024 : భారీ అంచనాలతో వచ్చి బోల్తా కొట్టిన తెలుగు సినిమాలివే
సుమ యాంకర్ గా వ్యవహరించబోతున్న ఈ కార్యక్రమం కోసం అమెరికాలోని డల్లాస్ నగరంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఒక ఆసక్తికర అంశం తెలిసింది. అదేంటంటే ప్రస్తుతానికి రామ్ చరణ్ తేజ అయ్యప్ప దీక్షలో ఉన్నారు. అయ్యప్ప మాల విసర్జన సమయానికి ఆయన అమెరికాలో ఉంటారు. అక్కడే డల్లాస్ లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో రాంచరణ్ తేజ దీక్ష విరమణ చేయబోతున్నారు అని తెలుస్తోంది. దీక్ష విరమణ అనంతరం రెగ్యులర్ అవుట్ ఫిట్ లోనే ఆయన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. శ్రీకాంత్ సహా పలువురు సీనియర్ నటీనటులు ఈ సినిమాలో భాగమయ్యారు. సంక్రాంతి టార్గెట్గా ఈ సినిమా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో భారీ వసూళ్లు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.