Pranaya Godari: ఎలాంటి రివ్యూలు ఇస్తారో అని అనుకున్నాం: ‘ప్రణయ గోదారి’ దర్శకుడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా తెరకెక్కిన ‘ప్రణయ గోదారి’ చిత్రం డిసెంబర్ 13న రిలీజ్ అయింది. పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో రూపొందిన ‘ప్రణయ గోదారి’ మూవీని పిఎల్‌వి క్రియేషన్స్‌పై పారమళ్ళ లింగయ్య నిర్మించారు. తాజాగా ఆడియెన్స్‌కు, మీడియాకు థాంక్స్ చెప్పేందుకు ప్రణయగోదారి టీం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు విఘ్నేశ్ మాట్లాడుతూ.. ‘చిన్న చిత్రమైనా పెద్ద హిట్ అందించిన ఆడియెన్స్, మీడియాకి థాంక్స్. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ టీంను అభినందించారు. విజువల్స్, పాటలు ఇలా ప్రతి విషయం గురించి మాట్లాడారు.
కొత్త టీం అయినా చాలా బాగా చేశారని మెచ్చుకున్నారు. ఆడియన్స్ ఫీడ్ బ్యాక్ విని మాకు చాలా ఆనందమేసింది. ప్రేక్షకులు బాగానే ఉందని అన్నారు.. కానీ మీడియా వారు ఎలాంటి రివ్యూలు ఇస్తారో అని అనుకున్నాం. మీడియా కూడా మా మూవీని మెచ్చుకుంది. ఇంత పెద్ద విజయాన్ని అందించిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు. ఇక హీరోయిన్ ప్రియాంక ప్రసాద్ మాట్లాడుతూ.. ‘మా సినిమాను అందరూ మెచ్చుకుంటున్నారు. నా పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. సదన్ గారు సెట్‌లో మా అందరినీ నవ్విస్తూ ఉంటారు. సాయి కుమార్ గారితో పని చేయడం ఆనందంగా ఉంది. మా సినిమాకు ఇంత ప్రేమను ఇస్తున్న ఆడియెన్స్‌కు థాంక్స్’అని అన్నారు.
Also Read
- Tags
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Mahesh Babu New Look: ఏమున్నాడ్రా బాబు.. సూపర్ స్టార్ న్యూ లుక్ వైరల్!
-
Redmi 17C 5G: రెడ్ మీ 17c 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 6.9 ఇంచెస్ 120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
రూ.5.49 లక్షలకే Tata Aeris.. 6 ఎయిర్‌బ్యాగ్స్, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్లతో బెస్ట్ ఫ్యామిలీ కారు విడుదల!
-
Bhumana Karunakar Reddy: తప్పుడు ప్రచారంపై భూమన ఫైర్.. ఇందుకేనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు జీతాలు..?
-
RRB NTPC Recruitment 2026: రైల్వేలో 3,477 ఉద్యోగాలు.. అర్హత, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!