మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా ముందు నుంచి ప్రచారం చేసుకుంటూ వస్తున్న కన్నప్ప సినిమా వాయిదా పడింది. నిజానికి ఈ సినిమాని ఏప్రిల్ 25వ తేదీన రిలీజ్ చేయాలని భావించారు, కానీ తాజాగా సినిమా వాయిదా వేస్తున్నట్లు విష్ణు ప్రకటించారు. కన్నప్ప సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నట్లు పేర్కొన్న ఆయన, హైయెస్ట్ స్టాండర్డ్స్‌తో సినిమా చేయడానికి కట్టుబడి ఉన్నానని చెప్పుకొచ్చారు. ఇంకా విఎఫ్ఎక్స్ వర్క్ చేయాల్సి ఉన్న కారణంగా సినిమా […]
తెలుగు సినిమా పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఓజీ’ (OG) పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమా రూ. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోందని, త్వరలోనే షూటింగ్‌ను పూర్తి చేసి విడుదల చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 2025లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనీ భావిస్తున్నట్టు తెలియడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ‘ఓజీ’ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ సుజీత్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రం […]
తెలుగు ఫిలిం జర్నలిస్ట్ సంఘాలతో తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు తాజాగా సమావేశం అయ్యారు. ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, అలాగే కార్యదర్శి దామోదర్ ప్రసాద్, ట్రెజరర్ ప్రసన్న కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్, ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో ఫేక్ థంబ్‌నెయిల్స్, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ కావడం వంటి అంశాలపై చర్చించారు. […]
యువ హీరో ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ జంటగా శ్రీ వెంకటేశ్వర ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచి కలిగిన నిర్మాత యం. బంగార్రాజు నిర్మించిన చిత్రం ‘మధురం’. ఈ సినిమాకు ‘ఎ మెమొరబుల్ లవ్’ అనే ట్యాగ్‌లైన్ ఉంది. టీనేజ్ ప్రేమకథగా రూపొందిన ఈ చిత్రం షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్ 18న థియేటర్లలో ఘనంగా విడుదల కానుంది.ఈ సందర్భంగా దర్శకుడు రాజేష్ చికిలే […]
మలయాళ సినిమా పరిశ్రమలో తనదైన నటనతో గుర్తింపు తెచ్చుకున్న షైన్ టామ్ చాకో, తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. 2023లో నాని హీరోగా వచ్చిన దసరా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన షైన్, ఆ తర్వాత వరుస సినిమాలతో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఈ కేరళ నటుడు తెలుగు ప్రేక్షకులను తన నటనా నైపుణ్యంతో ఆకట్టుకుంటూ, సైలెంట్‌గా స్టార్‌డమ్‌ను అందుకుంటున్నాడు. షైన్ టామ్ చాకో తెలుగులో తొలి అడుగు […]
ఆస్ట్రేలియా క్రికెట్ స్టార్ డేవిడ్ వార్నర్ తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెడుతున్నాడు అని తెలిసినప్పటి నుంచి అభిమానుల్లో ఉత్సాహం ఆకాశాన్ని తాకింది. నితిన్, శ్రీలీల హీరో హీరోయిన్లుగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన రాబిన్ హుడ్ సినిమాలో వార్నర్ ఒక స్పెషల్ క్యామియోలో కనిపించనున్నాడని ప్రకటించినప్పుడు, ఈ క్రికెటర్ తెలుగు సినిమా తెరపై ఏం చేయబోతున్నాడనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అంతేకాదు, సినిమా ప్రచార కార్యక్రమాల్లో వార్నర్ చురుగ్గా పాల్గొనడంతో అతని పాత్ర ఏదో పెద్దది, […]
కామాక్షి భాస్కర్ల వరుస చిత్రాలతో సినీ పరిశ్రమలో దూసుకుపోతున్నారు. ఆమె ఎంచుకునే కథలు, చేస్తున్న సినిమాలు, పోషిస్తున్న పాత్రలు ప్రేక్షకులకు సుపరిచితమే. ప్రస్తుతం కామాక్షి భాస్కర్ల వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అల్లరి నరేష్ హీరోగా రూపొందుతున్న హారర్ థ్రిల్లర్ “12A రైల్వే కాలనీ” షూటింగ్లో ఆమె పాల్గొంటున్నారు. ఇటీవలే నవీన్ చంద్ర నటించిన ఒక సినిమా చిత్రీకరణను పూర్తి చేశారు. అలాగే, బ్లాక్‌బస్టర్ ఫ్రాంచైజీ “పోలిమేర” మూడో భాగం షూటింగ్‌ను త్వరలో ప్రారంభించనున్నారు. విభిన్న ప్రాజెక్టులతో […]
వర్తమాన నేర ప్రపంచంలో జరుగుతున్న ఘటనల ఆధారంగా వైవిధ్యభరితమైన కథాంశంతో తెరకెక్కిన చిత్రం “కర్మణ్యే వాధికారస్తే”. ఈ నేర ప్రపంచంలో జరిగే ఉదంతాలను కర్తవ్యమే దైవంగా భావించే ఒక పోలీసు అధికారుల బృందం ఏవిధంగా ఎదుర్కొంది అనేది ఈ చిత్రం యొక్క కథాంశం. అమర్ దీప్ చల్లపల్లి దర్శకత్వం వహించారు. తొలి ప్రయత్నంలోనే తన దర్శకత్వ శైలితో ఆకట్టుకున్నారు. ఉషస్విని ఫిలిమ్స్ పతాకంపై డి ఎస్ ఎస్ దుర్గా ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్తాండ్ కె […]
డిజిటల్ మీడియా రంగంలో అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించిన వారిని గౌరవించేందుకు ‘VB ఎంటర్టైన్మెంట్స్ డిజిటల్ మీడియా అవార్డ్స్-2025’ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో డిజిటల్ మీడియా రంగంలోని వివిధ విభాగాల్లో విజేతలు అవార్డులను అందుకున్నారు. VVK సంస్థ సమర్పణలో, VB ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ వేడుకకు ‘VB ఎంటర్టైన్మెంట్స్’ అధినేత మరియు ‘ఈసీ మెంబర్ ఆఫ్ మా’ అయిన విష్ణు బొప్పన ఫౌండర్‌గా వ్యవహరించారు. విజేతలు అవార్డులను స్వీకరించి, తమ సంతోషాన్ని పంచుకున్నారు. ఈ వేడుకకు […]
విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ, హీరోగా తనకంటూ ఒక విశిష్టమైన గుర్తింపును సొంతం చేసుకున్న నటుడు సంపూర్ణేష్ బాబు. సంపూర్ణేష్ బాబు ఈసారి అన్నదమ్ముల మధ్య ఉండే ఆప్యాయతను కథాంశంగా తీసుకుని, వారి అనుబంధాన్ని చాటి చెప్పే ‘సోదరా’ అనే చిత్రంతో రాబోతున్నాడు. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబుతో కలిసి సంజోష్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. సంపూర్ణేష్ బాబు, సంజోష్, ప్రాచీ బంసాల్, ఆరతి గుప్తా ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ […]