మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా ముందు నుంచి ప్రచారం చేసుకుంటూ వస్తున్న కన్నప్ప సినిమా వాయిదా పడింది. నిజానికి ఈ సినిమాని ఏప్రిల్ 25వ తేదీన రిలీజ్ చేయాలని భావించారు, కానీ తాజాగా సినిమా వాయిదా వేస్తున్నట్లు విష్ణు ప్రకటించారు. కన్నప్ప సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నట్లు పేర్కొన్న ఆయన, హైయెస్ట్ స్టాండర్డ్స్‌తో సినిమా చేయడానికి కట్టుబడి ఉన్నానని చెప్పుకొచ్చారు. ఇంకా విఎఫ్ఎక్స్ వర్క్ చేయాల్సి ఉన్న కారణంగా సినిమా కాస్త ఆలస్యంగా విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి ‘ఓజీ’ గుడ్ న్యూస్
“మీరు సినిమా కోసం ఎంత ఎదురు చూస్తున్నారో నాకు తెలుసు, కానీ సినిమాని మరింత అద్భుతంగా మీ ముందుకు తీసుకొచ్చేందుకు విఎఫ్ఎక్స్ వర్క్ అవసరం. అందుకే ప్రస్తుతానికి ఆ పని మీద దృష్టి పెట్టాం. కచ్చితంగా మీరు ఆశ్చర్యపోయే ప్రోడక్ట్‌తో మీ ముందుకు రాబోతున్నాం. త్వరలోనే సినిమాకు సంబంధించిన కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాను,” అంటూ మంచు విష్ణు చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాని బాలీవుడ్‌లో రామాయణం డైరెక్ట్ చేసిన ముఖేష్ సింగ్ డైరెక్ట్ చేస్తుండగా, మంచు విష్ణు తన సొంత అవ ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు వంటి టాప్ యాక్టర్స్ నటిస్తున్నారు.
My Sincere Apologies! pic.twitter.com/WbAUJIVzHq
— Vishnu Manchu (@iVishnuManchu) March 29, 2025