యువ హీరో ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ జంటగా శ్రీ వెంకటేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచి కలిగిన నిర్మాత యం. బంగార్రాజు నిర్మించిన చిత్రం ‘మధురం’. ఈ సినిమాకు ‘ఎ మెమొరబుల్ లవ్’ అనే ట్యాగ్‌లైన్ ఉంది. టీనేజ్ ప్రేమకథగా రూపొందిన ఈ చిత్రం షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఏప్రిల్ 18న థియేటర్లలో ఘనంగా విడుదల కానుంది.ఈ సందర్భంగా దర్శకుడు రాజేష్ చికిలే మాట్లాడుతూ, “1990ల నేపథ్యంలో సాగే టీనేజ్ ప్రేమకథ ఇది. అప్పటి స్కూల్ వాతావరణం, ఆటలు, అల్లరి, చిన్న చిన్న గొడవలు ఎలా ఉండేవో ఈ తరం ప్రేక్షకులకు కళ్ల ముందు ఆవిష్కరించేలా ఈ సినిమాను రూపొందించాం. సినిమా చూసిన తర్వాత పాత తరం వారికి తమ స్కూల్, కాలేజ్ రోజులు గుర్తుకు వచ్చేలా ఈ చిత్రం ఉంటుంది. ఎంతో కష్టపడి ఈ సినిమాను తీర్చిదిద్దాం. నిర్మాత బంగార్రాజు గారు మాకు అండగా నిలిచి ప్రోత్సహించారు. మా డిఓపీ మనోహర్ అందమైన విజువల్స్‌తో సినిమాకు ప్రాణం పోశారు. ఈ చిత్రం ప్రతి ఒక్కరితోనూ అనుసంధానం అయ్యేలా ఉంటుంది,” అని అన్నారు. నిర్మాత యం. బంగార్రాజు మాట్లాడుతూ, “రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను రూపొందించాం. పోస్ట్ ప్రొడక్షన్, సెన్సార్ పనులు పూర్తయ్యాయి. ఏప్రిల్ 18న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఇప్పటికే నితిన్ గారు రిలీజ్ చేసిన టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. సినిమా కూడా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని నమ్ముతున్నాం,” అని చెప్పారు.