జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర జపాన్ వెర్షన్ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో జపాన్ పర్యటనకు వెళ్ళాడు. అక్కడ పెద్ద ఎత్తున జపాన్ మీడియాలో సినిమాని ప్రమోట్ చేస్తూ వస్తున్నాడు. అయితే జపాన్‌లో జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ చూస్తే పిచ్చెక్కి పోవడం ఖాయం. ఎందుకంటే ఆయనకు అభిమానులు జెండర్ తో సంబంధం లేకుండా బ్రహ్మరథం పడుతున్నారు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ అయితే ఆయన కోసం ఎగబడుతున్నారు. ఆటోగ్రాఫ్ లు తీసుకుంటూ, సెల్ఫీలు తీసుకుంటూ ఫోటోలకు ఫోజులు ఇవ్వమని కోరుతున్నారు. […]
విశ్వక్ సేన్ హీరోగా అనుదీప్ కేవీ ఫంకీ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా గురించి సినిమా నిర్మిస్తున్న నాగవంశీ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అదేమంటే ఈ సినిమా నాగ అశ్విన్ బయోపిక్ లాగా ఉంటుందని అన్నారు. ఈ సినిమా ఒక దర్శకుడు తన నిర్మాత కుమార్తెతో ప్రేమలో పడడం గురించి ఉంటుందని చెప్పుకొచ్చారు. నిజానికి నాగ్ అశ్విన్ కూడా తన మొదటి సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం నిర్మాత వైజయంతి మూవీస్ అధినేత అశ్వినిదత్ […]
మట్కా ఫ్లాప్ తర్వాత వరుణ్‌తేజ్ కొత్త సినిమా రీసెంట్గా మొదలైంది. మేర్లపాక గాంధీ దర్శకుడు. అయితే.. సినిమా జానర్ ఏమిటో చెప్పడానికి 4 నిమిషాల 20 సెకన్ల వీడియోను రిలీజ్చేశారు. యాక్షన్… థ్రిల్లర్.. కామెడీ.. హారర్.. రొమాన్స్. జానర్ పేరు చెప్పడానికి ఒక సెకన్ చాలు. కానీ వరుణ్‌తేజ్ ఫస్ట్ టైం హారర్ జానర్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎఫ్3 తర్వాత వచ్చిన మూడు సినిమా గాంఢీవధార అర్జున్.. ఆపరేషన్ వాలెంటైన్.. మట్కా వంటి హ్యాట్రిక్ ఫ్లాప్ తర్వాత […]
ప్రముఖ దర్శకుడు మారుతి, ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం “రాజా సాబ్” గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన “మాడ్ స్క్వేర్” సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో అతిథిగా పాల్గొన్న మారుతి, “నా చేత ఎలాంటి సినిమా చేస్తే ఆడియన్స్‌కి బాగా నచ్చుతుందో, అలాంటి సినిమానే ప్రభాస్‌తో తీయిస్తున్నాను. అందుకే చాలా సంతోషంగా, ధైర్యంగా, ఎలాంటి ఆందోళన లేకుండా పని చేస్తున్నా. ఇలా ఉంటేనే ది బెస్ట్ సినిమా వస్తుందని నమ్ముతున్నా” అని అన్నారు. “రాజా సాబ్” […]
ప్రదీప్ రంగనాథన్ తన దర్శకత్వంలో రూపొందిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘లవ్ టుడే’తో నటుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత తన ఇటీవలి హిట్ ‘డ్రాగన్’తో తమిళం మరియు తెలుగు రెండు భాషల్లోనూ విజయం సాధించి విపరీతమైన జనాదరణ పొందాడు. వరుస విజయాలతో ప్రదీప్ రంగనాథన్ తమిళ సినిమాల్లోనే కాకుండా తెలుగు పరిశ్రమలో కూడా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. పాన్-ఇండియా నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్, ప్రదీప్ రంగనాథన్ హీరోగా ఓ తమిళం-తెలుగు ద్విభాషా చిత్రాన్ని […]
మైత్రీ మూవీ మేకర్స్, తెలుగు సినిమా పరిశ్రమలో అగ్రగామి నిర్మాణ సంస్థలలో ఒకటిగా పేరొందిన ఈ బ్యానర్, 2026 సంవత్సరాన్ని చరిత్రాత్మకంగా మార్చబోతోంది. అతిపెద్ద తారాగణం, బ్లాక్‌బస్టర్ కథలతో కూడిన సినిమాలతో ఈ సంవత్సరం సినీ ప్రియులకు అద్భుతమైన అనుభవాన్ని అందించనుంది. తాజాగా రాబిన్ హుడ్ ఈవెంట్ లో #NTRNeel, #RC16, #PrabhasHanu, #UstaadBhagatSingh, #JaiHanuman, మరియు #VD14 వంటి భారీ చిత్రాలతో మైత్రీ మూవీ మేకర్స్ బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాయనుంది అని నిర్మాత రవి […]
తెలుగు సినిమా పరిశ్రమలో రాబోయే సంచలన చిత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన ‘ఓదెల 2’ సినిమా గురించి కొత్త సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా కంటెంట్ అద్భుతంగా ఉందని, ప్రేక్షకులకు సరికొత్త తమన్నా భాటియాను చూసే అవకాశం దక్కబోతోందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ‘ఓదెల రైల్వే స్టేషన్’ సినిమాకి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ సూపర్నాచురల్ థ్రిల్లర్‌లో తమన్నా ప్రధాన పాత్రలో ఒక శివ సత్తుగా కనిపించనుంది. సినిమా బడ్జెట్ సుమారు 23 కోట్ల రూపాయలు […]
తెలుగు సినిమా పరిశ్రమలో రెబల్ స్టార్ ప్రభాస్ ఒక సంచలనం. ‘బాహుబలి’ సిరీస్‌తో పాన్-ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన ఈ హీరో, ఆ తరువాత కూడా ఆ స్థాయి సినిమాలే చేస్తున్నాడు. ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేందుకు సిద్ధమవుతున్నాడు. దర్శకుడు హను రాఘవపూడి రూపొందిస్తున్న కొత్త చిత్రంలో ప్రభాస్ అగ్రహారం యువకుడిగా కనిపించబోతున్నాడు. ఈ పాత్ర ప్రభాస్ కెరీర్లో ఇప్పటివరకూ చేయని, మనం చూడని ఒక సరికొత్త తరహా పాత్రగా ఉండబోతోందని సమాచారం ప్రభాస్ అంటేనే యాక్షన్, […]
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్-ఇండియా చిత్రం ‘కుబేర’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో ప్రముఖ నటులు ధనుష్, నాగార్జున, రష్మికా మందన్నా, జిమ్ సర్భ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం షూటింగ్ ఏప్రిల్ నెలలో పూర్తి కానుంది. ఇప్పటికే నాగార్జునకు సంబంధించిన భాగాల షూటింగ్ ముగిసినట్లు తెలుస్తోంది, అయితే ధనుష్‌కు సంబంధించిన షూటింగ్ ఏప్రిల్‌లో సమాప్తం కానుంది. ఈ చిత్రం జూన్ 20, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది. […]
మెగాస్టార్ చిరంజీవి మరియు బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో రాబోతున్న చిత్రం గురించి తాజా అప్డేట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది. ఈ చిత్రం కోసం ఫైనల్ స్క్రిప్ట్ నరేషన్ పూర్తయి, లాక్ చేయబడినట్లు అనిల్ రావిపూడి స్వయంగా ట్వీట్ ద్వారా వెల్లడించారు. ఈ ట్వీట్లో చిరంజీవి పాత్రను “శంకర్ వరప్రసాద్”గా పరిచయం చేసినట్లు తెలిపారు. ఈ కథను విన్న చిరంజీవి దాన్ని పూర్తిగా ఆస్వాదించారని, ఎంజాయ్ చేశారని అనిల్ పేర్కొన్నారు. త్వరలో ముహూర్తంతో ఈ చిత్రం […]