తెలుగు ఫిలిం జర్నలిస్ట్ సంఘాలతో తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు తాజాగా సమావేశం అయ్యారు. ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్, అలాగే కార్యదర్శి దామోదర్ ప్రసాద్, ట్రెజరర్ ప్రసన్న కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్, ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో ఫేక్ థంబ్‌నెయిల్స్, ఫేక్ న్యూస్ స్ప్రెడ్ కావడం వంటి అంశాలపై చర్చించారు. ఇకమీదట ఛాంబర్ తరపున ఈ ఫేక్ న్యూస్, ఫేక్ థంబ్ నెయిల్స్ విషయంలో పోరాడే విషయంలో సపోర్ట్ లభిస్తుందని హామీ ఇచ్చారు.
Rakul Preet Singh : ఆ బట్టలు ధరించాలంటే లక్ష రూపాయల వరకు ఖర్చు పెట్టాలి..
అంతేకాక, సీరియస్ ఇష్యూస్ మీద క్రిమినల్ కేసులు బనాయించే విషయంలో కూడా ఛాంబర్ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే ఛాంబర్ పైరసీ విషయంలో సైబర్ టీంతో టచ్‌లో ఉందని, ఈ సెలబ్రిటీల అంశాలపై ఫేక్ న్యూస్, ఫేక్ థంబ్‌నెయిల్స్ పెడుతున్న వ్యవహారం మీద కూడా తాము వారితో మాట్లాడతామని ఈ సందర్భంగా ఛాంబర్ ప్రతినిధులు హామీ ఇచ్చారు. అలాగే, తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి నిర్వహిస్తున్న పలు ప్రెస్ మీట్స్ విషయంలో కూడా కొన్ని సూచనలు జర్నలిస్టు సంఘాల నుంచి, చాంబర్ నుంచి రాగా, వాటిపై చర్చలు జరిపారు.