Sodara: ఏప్రిల్ 11న సంపూర్ణేష్ బాబు ‘సోదరా’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విభిన్నమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ, హీరోగా తనకంటూ ఒక విశిష్టమైన గుర్తింపును సొంతం చేసుకున్న నటుడు సంపూర్ణేష్ బాబు. సంపూర్ణేష్ బాబు ఈసారి అన్నదమ్ముల మధ్య ఉండే ఆప్యాయతను కథాంశంగా తీసుకుని, వారి అనుబంధాన్ని చాటి చెప్పే ‘సోదరా’ అనే చిత్రంతో రాబోతున్నాడు. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబుతో కలిసి సంజోష్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. సంపూర్ణేష్ బాబు, సంజోష్, ప్రాచీ బంసాల్, ఆరతి గుప్తా ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా కొనసాగిస్తున్న ఈ చిత్రం, ఈ వేసవిలో ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆనందపరచనుంది. మన్ మోహన్ మేనం పల్లి దర్శకత్వంలో, క్యాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చంద్ర చగంలా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Ranya Rao: రన్యా రావుకు మరో షాక్.. పిటిషన్ తిరస్కరణ
Also Read
- Jim Jim Thara: జిమ్ జిమ్ తార.. నమ్మేలా ఉందా బాల?
- AK 47 Release Date Leaked: 'ఆదర్శకుటుంబం' రిలీజ్ డేట్ లీక్.. పోస్ట్ పెట్టి డిలీట్ చేసినా దొరికిపోయాడుగా!
- Sivakarthikeyan: ‘నీకు ఫ్యాన్స్ వేస్ట్’ అన్న నిర్మాతకు శివకార్తికేయన్ దిమ్మతిరిగే రిప్లై!
- Jim Jim Thara: లీకై వైరల్ అయిన ‘జిమ్ జిమ్ తార’ పాట వెనుక అసలు గుట్టు ఇదే!
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, “అన్నదమ్ముల మధ్య ఉండే సంబంధం ఎంత విలువైనదో అందరికీ తెలిసిందే. అలాంటి ఆప్యాయతను వెండితెరపై ప్రదర్శించే చిత్రమే ‘సోదరా’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు నాలుగు పాటలు ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందనను రాబట్టాయి. తెలుగు సినిమా పరిశ్రమలో ఎందరో సోదరులు ఉన్నారు, వారి అనుబంధాన్ని ప్రతిబింబించేలా ఈ ‘సోదరా’ రూపొందింది. ఈ వేసవిలో మా చిత్రం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని గట్టి విశ్వాసం ఉంది,” అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ, “సంపూర్ణేష్ బాబు నుంచి ప్రేక్షకులు ఎదురుచూసే వినోదంతో పాటు, ఆయనలోని మరో ప్రత్యేక కోణాన్ని ఈ సినిమాలో చూడబోతున్నారు. ఈ చిత్రం నిస్సందేహంగా విజయవంతం అవుతుందనే నమ్మకం మాకు ఉంది,” అని అన్నారు.
తాజావార్తలు
-
INDIA Bloc: రాహుల్ నిరసనకు అఖిలేష్ దూరం.. కాంగ్రెస్-SP మధ్య గ్యాప్?
-
పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
-
Maharashtra: మహా ఘోరం.. పెట్రోల్ బంక్ సీజ్ చేయడానికి వెళ్లిన అధికారి హత్య
-
Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
-
PM Modi: ‘‘మోడీని దించేందుకు ప్రయత్నిస్తున్నారు’’.. సెర్బియా మాజీ అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!