తెలుగు చిత్ర పరిశ్రమలో సింగిల్ థియేటర్లలో సినిమాల ప్రదర్శనకు సంబంధించి రెంట్ (అద్దె) విధానం, పర్సంటేజ్ (షేరింగ్) విధానంపై ఎగ్జిబిటర్లు – నిర్మాతల మధ్య మొదలైన వివాదం అనేక మలుపులు తిరుగుతూ వెళ్తున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు ప్రస్తుతం రెంటల్ విధానంపై ఎక్కువగా నడుస్తున్నాయి. ఈ విధానంలో నిర్మాతలు థియేటర్లకు నిర్ణీత అద్దె చెల్లించి సినిమాలను ప్రదర్శిస్తారు. అయితే, కలెక్షన్లు తక్కువగా ఉన్నప్పుడు థియేటర్లు షోలను రద్దు చేయడం లేదా మూసివేయడం వంటి […]
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి, తన భార్య ఆర్తితో విడాకుల వ్యవహారం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. గత ఏడాది (2024)లో వీరి విడాకుల ప్రకటనతో మొదలైన ఈ వివాదం, సోషల్ మీడియా వేదికగా రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది. తాజాగా, చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో జరిగిన విచారణలో ఆర్తి నెలవారీ భరణంగా రూ. 40 లక్షలు డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ అంశం ఇంటర్నెట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో, రవి […]
‘హరి హర వీరమల్లు’ సినిమా గీతావిష్కరణ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి మాట్లాడుతూ, “ఈ సినిమాతో నా ప్రయాణం ఐదేళ్ల క్రితం క్రిష్‌తో మొదలై, ఇప్పుడు జ్యోతికృష్ణతో సఫలమైంది. నేను ఎందరో దర్శకులతో పనిచేశాను, కానీ జ్యోతికృష్ణలో అరుదైన లక్షణం కనిపించింది. వేగంగా నిర్ణయాలు తీసుకుని, వాటికి కట్టుబడి, ఎడిటింగ్, గ్రాఫిక్స్, సంగీతం అన్నీ స్వయంగా పర్యవేక్షిస్తూ, నిద్రాహారాలు మాని ఈ చిత్రం కోసం అమితంగా శ్రమించాడు. Also Read: Yash Mother : […]
చేసిన సినిమాల కంటే వివాదాలతోనే ఎక్కువగా ప్రసిద్ధి చెందిన నటి పూనమ్ కౌర్, తాజాగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక స్టోరీని ఆమె షేర్ చేసింది. అందులో ఆమె ఇలా అన్నారు: ” ఈ విషయం నేను ముందే చెప్పాను, ఇప్పుడు మళ్లీ చెబుతున్నాను. నేను త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై ఈమెయిల్ ద్వారా ఒక ఫిర్యాదు చేశాను. ఝాన్సీ గారితో మాట్లాడాను. […]
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, పాన్ ఇండియా సూపర్ డైరెక్టర్ అట్లీ కలయికలో ఓ బ్లాక్‌బస్టర్ మూవీ రూపొందుతోందన్న విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రేజీ కాంబో కోసం ఇండియన్ సినీ లవర్స్‌తో పాటు గ్లోబల్‌గా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అట్లీకి ఇది ఫస్ట్ తెలుగు మూవీ కాగా, సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ సమర్పణలో ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇంటర్నేషనల్ స్థాయిలో తెరకెక్కనుంది. లాస్ ఏంజెల్స్‌లోని ఓ స్టూడియోలో […]
కన్నడ సినీ పరిశ్రమలో రాకింగ్ స్టార్ యష్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన తల్లి శ్రీమతి పుష్ప అరుణ్‌కుమార్ ఇప్పుడు నిర్మాతగా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు ఆమె PA ప్రొడక్షన్స్ బ్యానర్‌ను స్థాపించి, కన్నడ చిత్ర పరిశ్రమలో దిగ్గజ నటుడు డా. రాజ్‌కుమార్, ఆయన భార్య పార్వతమ్మ రాజ్‌కుమార్ స్ఫూర్తితో కొత్తవారికి అవకాశాలు కల్పిస్తున్నారు. పుష్ప అరుణ్‌కుమార్ నిర్మాతగా తొలి చిత్రం ‘కొత్తలవాడి’. ప్రతిభావంతుడైన నటుడు పృథ్వీ అంబార్ హీరోగా నటిస్తున్న […]
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ‘రక్షక్’ను అధికారికంగా ప్రకటించారు. శ్రీనిధి క్రియేషన్స్ బ్యానర్‌పై నూతన దర్శకుడు నవీన్ కొల్లి రూపొందిస్తున్న ఈ గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌కు ‘రక్షక్’ అనే శక్తివంతమైన టైటిల్‌ను ఎంచుకున్నారు. టైటిల్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. మంచు మనోజ్ శక్తిమంతమైన లుక్‌తో సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నారు. పోస్టర్‌పై కనిపించే “The hidden truth is never hidden forever (దాచిన నిజం ఎప్పటికీ దాగి ఉండదు)” […]
తెలుగు సినిమా పరిశ్రమలో ఐకానిక్ ఫ్రాంచైజీలలో ఒకటైన ‘ఆర్య’ సిరీస్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ వెలుగులోకి వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ ‘ఆర్య-3’ టైటిల్‌ను రిజిస్టర్ చేసినట్లు సమాచారం. ఈ వార్త అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ‘ఆర్య’ (2004) సినిమా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లో మైలురాయిగా నిలిచింది. దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం, అల్లు అర్జున్ను యూత్ ఐకాన్‌గా మార్చడమే కాకుండా, తెలుగు సినిమాలో […]
బాలీవుడ్లో అత్యంత విజయవంతమైన కామెడీ సిరీస్‌లలో ఒకటైన ‘హేరాఫేరి’ మూడో భాగం ‘హేరాఫేరి 3’ విషయంలో ఊహించని వివాదం చెలరేగింది. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వంలో, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న ఈ చిత్రం గత కొన్నేళ్లుగా చర్చనీయాంశంగా ఉంది. అయితే, ఈ సిరీస్‌లో బాబూరావ్ గణపత్ రావ్ ఆప్టే పాత్రతో అభిమానులను అలరించిన నటుడు పరేష్ రావల్, ‘హేరాఫేరి 3’ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించడం సినీ వర్గాల్లో సంచలనం రేకెత్తించింది. ‘హేరాఫేరి’ సిరీస్‌లో బాబూరావ్ […]
2025 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తెలుగు సినిమా ‘ఎం4ఎం’ (M4M – Motive for Murder) ప్రపంచ వేదికపై తన ఘనతను చాటుకుంది. మోహన్ వడ్లపట్ల దర్శకత్వంలో, అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం, కేన్స్‌లోని ప్రతిష్ఠాత్మక PALAIS-C థియేటర్లో రెడ్ కార్పెట్ స్క్రీనింగ్ ద్వారా ప్రదర్శించబడింది. ఈ వేడుకకు అంతర్జాతీయ ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమ తరపున దర్శకుడు మోహన్ వడ్లపట్ల, నటి జో శర్మ […]