లోకేశ్ కనగరాజ్ కూలీపై హైప్ పుట్టించేందుకు ప్రమోషన్లలో భాగంగా ఒక్కొక్క సాంగ్ రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. చికిటు వైబ్ తర్వాత మోనికా అంటూ పూజా హెగ్డేతో మాసివ్ స్టెప్పులేయించాడు. రంగస్థలంలో జిగేల్ రాణిగా మెప్పించిన బుట్టబొమ్మ.. ఈ పాటతోనూ ఇరగదీసింది అందులో నో డౌట్. కానీ క్రెడిట్ మాత్రం ఆమెకు సగమే దక్కింది. మిగిలిన హాఫ్ తీసేసుకున్నాడు మలయాళ యాక్టర్ సౌబిన్ షాహీర్. మాలీవుడ్ చిత్రాలను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికీ పరిచయం చేయనక్కర్లేని పేరు సౌబిన్ షాహీర్. కుంబలంగి నైట్స్, ఆండ్రాయిడ్ కుంజప్పన్, రోమాంచం.. మంజుమ్మల్ బాయ్స్ డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువయ్యాడు సౌబిన్.
Also Read : Indian 3 : ఇండియన్ 3కి ఏమైంది?
హీరో మెటీరియల్ కాదు కానీ మలయాళంలో సైడ్ యాక్టర్ నుండి హీరోగా మారి ఇప్పుడు మాలీవుడ్‌లో వన్ ఆఫ్ ది టాప్ స్టార్‌గా ఎదిగాడు సౌబిన్. కూలీతో కోలీవుడ్‌లోనే కాదు పాన్ ఇండియాను పలకరించబోతున్న ఈ హీరో.. మోనికా సాంగ్‌లో ఎనర్జటిక్ స్టెప్పులేసి.. వాట్ ఎ డ్యాన్సర్ అని ఫ్రూవ్ చేసుకున్నాడు. లోకేశ్ అతడిలో నటుడే కాదు.. అంతకు మించిన టాలెంటర్ ఉన్నాడని చూపించాడు. సైలెంట్ క్యారెక్టర్స్ చేసే మలయాళ హీరోతో అదిరిపోయే మూమెంట్స్ వేయించాడు శాండీ మాస్టర్. సౌబిన్ ఇప్పుడే ఈ స్కిల్ బయటకు తీశాడు అనుకుంటే పొరపాటే.. మూడేళ్ల క్రితం వచ్చిన భీష్మ పర్వంలోనూ ఓ సాంగ్‌లో డ్యాన్స్ ఫెర్మామెన్స్ చూపించాడు ఈ హీరో. కెరీర్ స్టార్టింగ్ నుండే డ్యాన్స్ మూమెంట్స్‌పై కాన్సట్రేషన్ చేస్తున్నట్లే కనిపిస్తోంది సౌబిన్. ప్రేమమ్ సినిమాలో ఓ చిన్న స్టెప్ వేసి వావ్ అనిపించాడు. కోలీవుడ్, టాలీవుడ్‌కు సౌబిన్ డ్యాన్స్ కొత్తేమో కానీ.. మాలీవుడ్ ప్రేక్షకులకు కాదు. అతడి మూన్ వాక్ కు పిచ్చ ఫ్యాన్స్ ఉన్నారు. స్టేజీ ఎక్కిన ప్రతిసారి ఇలాంటి స్టెప్పులేయాలంటూ ఆయన్ను కోరుతుంటారు. కాదనకుండా డ్యాన్స్ వేసి ఎంటర్టైన్ చేస్తుంటాడు. మొత్తానికి యాక్టింగే కాదు.. తనలో డ్యాన్సర్ కూడా దాగి ఉన్నాడని ఫ్రూవ్ చేస్తున్న ఈ మాలీవుడ్ హీరో నుండి ఫ్యూచర్‌లో మరిన్ని మంచి డ్యాన్స్ మూమెంట్స్ వస్తాయోమో చూద్దాం.