Indian 3 : ఇండియన్ 3కి ఏమైంది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, దానికి సీక్వెల్‌గా రూపొందిన ఇండియన్ 2 మాత్రం దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. నిజానికి, ఇండియన్ 2 రిలీజ్ చేస్తున్నప్పుడే లైకా ప్రొడక్షన్స్ సంస్థ తమ దగ్గర ఇండియన్ 3 కూడా సిద్ధంగా ఉందని, 2025లో రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేసింది.
Also Read : Akhanda 2 : చెప్పిన డేటుకి దిగుతాడా?
Also Read
అయితే, ఇండియన్ 2 డిజాస్టర్ కావడం, ఆ తర్వాత శంకర్ దర్శకత్వంలో వచ్చిన గేమ్ చేంజర్ కూడా డిజాస్టర్ కావడంతో, ఇప్పుడు ఇండియన్ 3పై ఆ ప్రభావం పడుతోంది. నిజానికి, ఇండియన్ 3 షూటింగ్ అంతా పూర్తయింది, ఇంకా కొద్దిగా టచ్-అప్ చేయాల్సి ఉంది. అయితే, ఇండియన్ 2 మరియు గేమ్ చేంజర్ ఫలితాల కారణంగా శంకర్‌కు బడ్జెట్ ఇవ్వడానికి లైకా సంస్థ ఏమాత్రం సిద్ధంగా లేదు.
Also Read : Lokesh Kanagaraj : రజినీకాంత్ కు చెప్పిన కథ వేరు.. తీసింది వేరు : లోకేష్
ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ఫైనల్ అవుట్‌పుట్ ఇంకా సిద్ధం కాలేదు. నిజానికి, ఈ సినిమా కోసం శంకర్‌తో సహా కమల్ హాసన్‌కు ఇప్పటికే నిర్మాతలు రెమ్యూనరేషన్ ఇచ్చేశారు. కానీ, సినిమా బిజినెస్ మాత్రం జరగడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము ఈ సినిమా తీసుకోలేమని ఓటీటీ సంస్థ కూడా డీల్ నుంచి బయటకు వచ్చేసింది. మొత్తం మీద, ఇండియన్ 3 సినిమాపై భారీగా ప్రభావం పడింది. అది ఎప్పుడు రిలీజ్ అవుతుందనే విషయంపై ఎవరికీ క్లారిటీ లేదని చెప్పాలి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!