మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, దర్శకుడు మేర్లపాక గాంధీతో కలిసి ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం #VT15తో ప్రేక్షకులను ఆశ్చర్యపరచనున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ ఆశలు నెలకొన్నాయి. వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన అద్భుతమైన పోస్టర్ అభిమానులను ఆకర్షించింది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నాయి. సంగీత దర్శకుడు ఎస్. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. Also Read:Nishikant Dubey: కాంగ్రెస్ భారత్ భూభాగాన్ని పాకిస్తాన్‌కి ఇచ్చింది.. […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి విజయవంతమైన చిత్రాలతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన సందీప్ రెడ్డి వంగా, ఈ సినిమాతో ప్రభాస్‌ను పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవర్‌ఫుల్‌గా ఆవిష్కరించనున్నారు. ఈ చిత్రం ప్రకటన వెలువడినప్పటి నుంచి అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమా హీరోయిన్ […]
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి, అభివృద్ధి చేయాలని, ఈ రంగంలో ఉన్నవారి గౌరవమర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే – తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడినట్లు ఆయన ఆఫీస్ నుంచి ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. . ఎన్.డి.ఏ. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని తెలుగు సినిమా […]
అడవి శేష్ తాజా చిత్రం ‘డెకాయిట్’ ఆడియో రైట్స్ రూ. 8 కోట్లకు సోనీ మ్యూజిక్ కొనుగోలు చేయడం తెలుగు సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టించిన నేపథ్యంలో, మరో ఆసక్తికరమైన చిత్రం ‘నిలవే’ గురించి సమాచారం అందుబాటులోకి వచ్చింది. సౌమిత్ రావు, శ్రేయాసి సేన్ జంటగా నటిస్తున్న ‘నిలవే’ చిత్రం ఒక మ్యూజికల్ లవ్ డ్రామాగా రూపొందుతోంది. సౌమిత్ రావు, సాయి వెన్నం సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని POV ఆర్ట్స్ వ్యూ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై, […]
‘భైరవం’ అందరూ రిలేట్ అయ్యే ఎమోషన్స్ తో గ్రేట్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే సినిమా. తప్పకుండా అందరికీ నచ్చుతుంది: హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ భైరవం టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్‌కు అద్భుత స్పందనతో, పాజిటివ్ బజ్‌తో ముందుకు దూసుకెల్తుతోంది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె. రాధామోహన్ భారీ నిర్మించారు. పెన్ స్టూడియోస్ […]
అడవి శేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డెకాయిట్’ ఆడియో రైట్స్‌ను ప్రముఖ మ్యూజిక్ కంపెనీ సోనీ మ్యూజిక్ భారీ మొత్తమైన రూ. 8 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ చిత్రం అడవి శేష్ కెరీర్లో అత్యధిక ఆడియో రైట్స్ సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. సుప్రియ నిర్మాణంలో, ప్రముఖ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అడవి శేష్, తనదైన నటన, కథ ఎంపికలతో తెలుగు సినిమా […]
రామ్ చరణ్ హీరోగా, ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై మిశ్రమ స్పందనను అందుకుంది. ఈ సినిమా ఎడిటింగ్‌లో కీలక పాత్ర పోషించిన మలయాళ ఎడిటర్ షమీర్ మహ్మద్, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శంకర్‌తో తన అనుభవం గురించి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా ఎడిటింగ్ ప్రక్రియ, శంకర్‌తో పని చేసిన అనుభవం, సినిమా ఆలస్యం కావడానికి కారణాలను షమీర్ వెల్లడించారు. షమీర్ తన ఇంటర్వ్యూలో, […]
Theatres Closure : జూన్ 1వ తేదీ నుంచి సినిమా హాళ్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయంపై విచారణ చేపట్టాలని, ఈ నిర్ణయం వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హోం శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. Read Also : HHVM : వీరమల్లు గురించే టెన్షన్.. ముందున్నవి సినిమాలు కాదా..? తాజాగా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా […]
Theater Strike : హైదరాబాద్‌లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో మే 24, 2025 శనివారం ఉదయం ప్రొడ్యూసర్స్ మరియు ఎగ్జిబిటర్స్ మధ్య ఒక కీలక జాయింట్ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశం అనంతరం ఫిల్మ్ ఛాంబర్ ప్రెస్ మీట్ నిర్వహించి, చర్చల ఫలితాలను మరియు తీసుకున్న నిర్ణయాలను అధికారికంగా ప్రకటించనుంది. ఈ మీటింగ్‌లో ప్రధానంగా థియేటర్ రెంటల్ విధానం, ఎగ్జిబిటర్స్ డిమాండ్ చేస్తున్న పర్సెంటేజ్ ఆధారిత రెవెన్యూ షేరింగ్ మోడల్‌పై చర్చ జరగనుంది. సమాచారం ప్రకారం, […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఆధ్వర్యంలో మొదలైన ‘హరిహర వీరమల్లు’ చిత్రం ఎట్టకేలకు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో పూర్తయింది. ఇక ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ డేట్‌ను ఖరారు చేసుకుంది. ఈ పాన్-ఇండియా పీరియాడిక్ యాక్షన్ డ్రామా, ఎన్నో వాయిదాల తర్వాత, 2025 జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసిన చిత్ర యూనిట్, హైదరాబాద్, కాశీ, మరియు తిరుపతిలో గ్రాండ్ ఈవెంట్లను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.