స్వామి కార్యం.. స్వకార్యం ఒక్కసారి పూర్తిచేస్తున్నాడు అల్లు అర్జున్. అసలు విషయం ఏమిటంటే అల్లు అర్జున్ NATA, NATS ఆహ్వానం మేరకు అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే. నార్త్ అమెరికా తెలుగు సొసైటీ, నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ కార్యక్రమాలు ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న నేపథ్యంలో ఆయనను ఆహ్వానించారు.
Also Read:Rajamouli: జక్కన్నా.. ఇంకా చెక్కుతున్నావా??
ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. అయితే ప్రస్తుతం అట్లీతో సినిమా చేస్తున్న నేపథ్యంలో మళ్లీ ఎప్పుడు వెకేషన్‌కి టైం దొరుకుతుందో ఏమో తెలియని నేపథ్యంలో తన భార్య, ఇద్దరు పిల్లల్ని కూడా అమెరికా తీసుకువెళ్లాడు. ఈ నేపథ్యంలో అమెరికాలో మీటింగ్ ఉన్న టైంలో పాల్గొంటున్నాడు, లేని టైంలో తన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ వారికి వెకేషన్ ఫీల్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.
Also Read:Tollywood: పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. అంతా గజిబిజి గందరగోళం
అలా ఒకే సమయంలో స్వామి కార్యం సౌకర్యం చక్కబెట్టడం చేస్తూ అల్లు అర్జున్ ఫ్యామిలీ గోల్స్ సెట్ చేస్తున్నాడు. ప్రస్తుతానికి ఆయన అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఇప్పటికే దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ 4 పాత్రలలో కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతోంది.