సినిమా ప్రమోషన్స్‌లో టాలీవుడ్లో ఒక కొత్త ట్రెండ్ మొదలైంది. సీనియర్ డైరెక్టర్ అయినా, జూనియర్ అయినా… అందరూ ఇప్పుడు దర్శకుడు అనిల్ రావిపూడి వేసిన దారిలోనే నడుస్తున్నారు. ఈ విషయంలో ప్రమోషన్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా అనిల్ రావిపూడి నిలిచారు. తాజాగా, దర్శకుడు హరీష్ శంకర్ కూడా అనిల్‌ను అనుసరిస్తున్నారు. అనిల్ రావిపూడి తన సినిమాలలో హీరోలకు సంబంధించిన చిన్న అప్డేట్లు, ముఖ్యంగా సినిమా సెట్స్‌లో ఏం జరుగుతుందో చూపిస్తూ రకరకాల ప్రమోషన్స్ చేయడం అలవాటు చేసుకున్నారు. ఈ […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తెలుగు దర్శకులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే చర్చ ఫిల్మ్ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది. పాన్ ఇండియా హీరోగా ఆయనకు క్రేజ్ రావడంలో తెలుగు దర్శకుల పాత్ర ఉన్నప్పటికీ, బన్నీ ఇప్పుడు కేవలం ఇతర భాషల దర్శకులు చెప్పిన కథల మీదే దృష్టి పెడుతున్నారని తెలుస్తోంది. ‘పుష్ప 2’ బ్లాక్‌బస్టర్ తర్వాత అల్లు అర్జున్ మైండ్‌సెట్ పూర్తిగా మారిపోయిందని అంటున్నారు. ఆయన ఇప్పుడు ‘అద్భుతం సృష్టించాలన్న’ ఆలోచనలో ఉన్నారు. ఇదే నేపథ్యంలో, […]
సంక్రాంతి తెలుగు సినిమాలకు ఒక పెద్ద సీజన్. ఆ సమయంలో మూడు, నాలుగు సినిమాలను కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. బావుంటే అవన్నీ కూడా హిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే, ఇప్పటికే తెలుగులో రెండు పెద్ద సినిమాలు సంక్రాంతికి కర్చీఫ్ వేసుకున్నాయి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారి సినిమాతో పాటుగా, ప్రభాస్ రాజా సాబ్ సినిమా ఇప్పటికే సంక్రాంతికి ఫిక్స్ చేసుకున్నారు. వీరితో పాటు రవితేజ సినిమాతో పాటు, […]
నటి సమంత రాజ్ నిడుమోరు అనే దర్శకుడిని రెండవ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, వీరి వివాహం అనంతరం, ఈ వివాహం నేపథ్యంలో వారికి చాలామంది శుభాకాంక్షలు తెలియజేస్తుంటే, కొంతమంది మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. అందులో ముఖ్యంగా, సమంతకు గతంలో వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్‌గా వ్యవహరించిన సాధనా సింగ్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక స్టేటస్ వైరల్ అయింది. అందులో ఆమె “అసలైన నేరస్థుడే బాధితుడు అన్నట్టు కలరిచ్చి, ఇప్పుడు తన నిజస్వరూపం బయటపెట్టాడు” […]
ఇండియన్, ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో సినిమాలు, డ్రామాలు నిర్మించాలని ప్రముఖ కొరియన్ దర్శక నిర్మాత యూ ఇన్-షిక్ఆకాంక్షించారు. న్యూఢిల్లీలోని కొరియా రిపబ్లిక్ రాయబార కార్యాలయం, కొరియన్ ఫిల్మ్ కౌన్సిల్ భాగస్వామ్యంతో, హైదరాబాద్‌లోని కొరియా గౌరవ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన మూడవ కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆయన ఈ విషయం వెల్లడించారు. బంజారా హిల్స్‌లోని ఎల్.వి. ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్స్‌లో ఈ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. కొరియన్ యాక్టింగ్ అంబాసిడర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, […]
తెలుగు ప్రేక్షకులు ఇప్పుడు స్టార్ ఇమేజ్ కంటే కంటెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ క్రమంలోనే చిన్న హీరోలు, కొత్త దర్శకులు కూడా ధైర్యంగా డిఫరెంట్ స్క్రిప్ట్‌లతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు. అలా ఓ డిఫరెంట్ కంటెంట్‌తో రాబోతున్న చిత్రమే ‘పైసావాలా’. అధ్విక్ అలియాస్ రాజేష్ బెజ్జంకి, శ్రీధర్, సృజనక్షిత, పి. అన్షు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని కె. నవీన్ తేజస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఏఆర్ ఎంటర్టైన్మెంట్స్, ఫైవ్ ఎలిమెంట్స్ క్రియేషన్స్, వీకేఎం మూవీస్ బ్యానర్స్‌పై […]
తేజస్ గుంజల్ ఫిలిమ్స్, రోహిత్ గుంజల్ ఫిలిమ్స్ బ్యానర్లపై వెంకటేష్ పెద్దపాలెం, అపర్ణ మల్లిక్, హీనా సోని హీరో, హీరోయిన్స్‌గా నటిస్తున్న యాక్షన్ క్రైమ్ డ్రామా చిత్రం వన్ బై ఫోర్(One/4). బ్లాక్ బస్టర్ బాహుబలి చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన బాహుబలి పళని కె ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రంజన రాజేష్ గుంజల్, రోహిత్ రాందాస్ గుంజల్ సంయుక్తంగా ఈ మూవీ ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 12న విడుదల చేయబోతున్నారు. ఈక్రమంలో […]
భరత్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద పీలం పురుషోత్తం నిర్మాణంలో భరత్, సంతోష్ దర్శకత్వంలో రానున్న చిత్రం ‘జగన్నాథ్’. ఈ మూవీలో రాయలసీమ భరత్ హీరోగా, నిత్యశ్రీ, ప్రీతి, సారా హీరోయిన్లుగా నటిస్తున్నారు. భరత్ హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా చేస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన అన్ని పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ప్రమోషన్స్ మీద చిత్రయూనిట్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ‘జగన్నాథ్’ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు జనాల్లో క్యూరియాసిటీని పెంచేశాయి. ఆల్రెడీ హీరో భరత్ జనాల్లోకి వెళ్లి సినిమాను […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా చిత్రం ‘స్పిరిట్’ షూటింగ్ మొదలైంది. ఈ సినిమా షూటింగ్ నిన్న (గురువారం) హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తాజా సమాచారం ప్రకారం, హీరో ప్రభాస్ శుక్రవారం (నవంబర్ 28, 2025) నుంచి నేరుగా ‘స్పిరిట్’ సెట్స్‌లో జాయిన్ అయ్యారు. ప్రభాస్ తన షెడ్యూల్లో భాగంగా డిసెంబర్ నెలాఖరు వరకు హైదరాబాద్‌లో తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేయనున్నారు. […]
నవీన్, కుసుమ చందక జంటగా ఆన్ క్యాన్ ఎంటర్టైన్మెంట్స్, క్రిసెంట్ సినిమాస్ బ్యానర్ల మీద మాదల వెంకటకృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘లవ్ డేస్’. ఏ టాక్సిక్ లవ్ స్టోరీ అనేది ఉప శీర్షిక. ఈ మూవీని సురేష్ లంకలపల్లి తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్, గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు సముద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు సముద్ర మాట్లాడుతూ .. ‘‘గీతాంజలి’, ‘తొలి ప్రేమ’, ‘అందాల […]