Raghu Kunche: కాన్వాయ్’లా వెళ్లడం గర్వంగా అనిపించేది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణా రెడ్డి రచనా దర్శకత్వంలో స్వీయ నిర్మాతగా రూపొందిన చిత్రం “దేవగుడి”. ఈ సినిమాలో ఈ అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె ప్రధాన పాత్రల్లో నటించారు. “దేవగుడి” సినిమా ఈ నెల 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి, నటుడు రఘు కుంచె.
రఘుకుంచె మాట్లాడుతూ నేను దేవగుడి వీరారెడ్డి అనే పాత్రలో నటించాను. ఆయన ఆ చుట్టు పక్కల ఏరియాలో పవర్ ఫుల్ వ్యక్తి. నాకు పలాస సినిమా తర్వాత అలాంటి రోల్స్ వస్తున్నాయి. ఈ సినిమాలో వీరారెడ్డి పాత్ర కోసం దర్శకుడు రామకృష్ణా రెడ్డి ఎలా చెబితే అలా పర్ ఫార్మ్ చేశాను. రాయలసీమ యాసలో డైలాగ్స్ చెప్పాను. ఈ సినిమా షూటింగ్ అంతా రియల్ లొకేషన్స్ లో చేశాం. ఎక్కడైతే కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయని దర్శకుడు స్క్రిప్ట్ రాశారో అక్కడే షూటింగ్ చేశాం. దర్శకుడిగా, నిర్మాతగా బెల్లం రామకృష్ణా రెడ్డి గారు ఆయన జాబ్ పర్పెక్ట్ గా చేశారు. సినిమా కోసం బాగా ఖర్చు పెట్టారు. అలాగే దర్శకుడిగా ప్రతి సీన్ చాలా క్లారిటీగా రూపొందించారు. నేను జీబులో వెళ్తుంటే నా పక్కన ఓ ఇరవై సుమోలు, జీబ్స్ వస్తుంటాయి. అన్ని వాహనాలతో కాన్వాయ్ లా వెళ్లడం పర్సనల్ గా గర్వంగా అనిపించేది. నాకు రియల్ లైఫ్ లో అలాంటి సందర్భం రాదు కదా. కాబట్టి వీరారెడ్డి పాత్రలో నటించడాన్ని రోజూ ఎంజాయ్ చేశాను. యాక్షన్ సీక్వెన్సుల్లో మాత్రం కొన్ని బాంబ్ బ్లాస్ట్స్ ఉన్నాయి. అప్పుడు మాత్రం భయమేసేది. యాక్టర్ కావాలని నేనెప్పుడూ అనుకోలేదు. అలా జరిగిపోయింది. సింగర్ కావాలనే ఇండస్ట్రీకి వచ్చాను. దాదాపు 40 సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేశాను. వచ్చిన అవకాశాలు వదులుకోకుండా నటిస్తున్నాను. నటుడిగా పెద్ద ప్రతిభావంతుడిని అనుకోవడం లేదు. అయితే సిన్సియర్ గా నా పాత్రకు న్యాయం చేసేలా ప్రయత్నిస్తున్నాను. మనోజ్ బాజ్ పాయ్ ఫ్యామిలీ మ్యాన్ లో చేసినట్లు అలాంటి క్యారెక్టర్స్ లో నటించాలని ఉంది. ప్రస్తుతం నాలుగైదు చిత్రాల్లో నటిస్తున్నా.
Also Read
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్‌లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
తాజావార్తలు
-
iQOO Pad Ultra: iQOO ప్యాడ్ అల్ట్రా లాంచ్ డేట్ ఫిక్స్.. 8.8-అంగుళాల డిస్‌ప్లే, PC-గ్రేడ్ కూలింగ్ ఫ్యాన్!
-
Road Accident: టిప్పర్ లారీ బీభత్సం.. తండ్రి కూతురు మృతి..!
-
UK SPLIT : బ్రిటీష్ సామ్రాజ్యం ముక్కలవబోతోందా?
-
PM Modi Birthday 2026: ప్రధాని మోడీ పుట్టినరోజు.. దేశవ్యాప్తంగా నేటి నుంచి ‘స్వచ్ఛతా హీ సేవ’ ప్రత్యేక కార్యక్రమాలు
-
CM Chandrababu: ధరలకు కళ్లెం.. ద్రవ్యోల్బణం కట్టడికి సీఎం కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!