-
Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’లో కంటతడి పెట్టించిన డ్రైవర్ సీన్: దిల్ రాజు, హరీష్ శంకర్ నిజ జీవిత ఘటనే!
కోలీవుడ్ స్టార్ సూర్య కథానాయకుడిగా తెరకెక్కిన తాజా ఫ్యామిలీ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’ బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాలో భావోద్వేగ సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా థియేటర్లలో ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుని, కంటతడి పెట్టించిన డ్రైవర్ ముత్తుస్వామి పాత్రకు సంబంధించిన ఎమోషనల్ సీన్ వెనుక ఉన్న అసలైన నిజాన్ని దర్శకుడు వెంకీ అట్లూరి తాజాగా వెల్లడించారు. ఈ సన్నివేశం కేవలం సినిమాటిక్ […] -
Tollywood: టాలీవుడ్ నిర్మాతలకు టీ సర్కార్ కీలక ఆదేశాలు
తెలంగాణలో భారీ బడ్జెట్ సినిమాల టికెట్ ధరల పెంపు వ్యవహారంలో ప్రభుత్వం అత్యంత కీలకమైన, సంచలన ఉత్తర్వులను జారీ చేసింది. టికెట్ ధరల పెంపు ద్వారా చిత్ర నిర్మాణ సంస్థలు, ఎగ్జిబిటర్లు ఆర్జిస్తున్న అదనపు ఆదాయంపై సరికొత్త నిబంధనను తెరపైకి తెచ్చింది. ప్రత్యేక అనుమతులతో టికెట్ ధరలు పెంచిన సినిమాల కలెక్షన్లలో ఏకంగా 20 శాతాన్ని సినీ కార్మికుల సంక్షేమానికి కేటాయించాలని తెలంగాణ సర్కార్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. నిజానికి ఇది పాత నిబందనే కానీ […] -
Film Federation: ఆ 20 శాతం వాటా ఇవ్వాల్సిందే.. బడా నిర్మాతలకు అల్టిమేటం!
ప్రభుత్వ జీవో ప్రకారం టికెట్ ధరలు పెంచుకున్న సినిమాల నుంచి సినీ కార్మికుల సంక్షేమ నిధికి రావాల్సిన 20 శాతం వాటాపై తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ తీవ్రంగా స్పందించింది. నేడు జరిగిన అత్యవసర కౌన్సిల్ సమావేశంలో కార్మికుల సంక్షేమానికి సంబంధించిన నిధుల వసూలు అంశం ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఇచ్చిన టికెట్ హైక్ జీవో ప్రకారం, పెరిగిన ధరల నుంచి వచ్చే మొత్తంలో 20 శాతాన్ని సినీ కార్మికుల వెల్ఫేర్ అకౌంట్‌కు జమ చేయాల్సి ఉంది. […] -
Telugu Film Federation: జానీ మాస్టర్‌కు ఫిల్మ్ ఫెడరేషన్ ఊహించని షాక్.. మళ్లీ సస్పెన్షన్ వేటు!
తెలుగు చిత్ర పరిశ్రమలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ వివాదం మళ్లీ రాజుకుంది. డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో చెలరేగిన అంతర్గత విభేదాలు, జానీ మాస్టర్ వర్సెస్ శేఖర్ మాస్టర్ వివాదం నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో ఎత్తివేసిన జానీ మాస్టర్ సస్పెన్షన్‌ను మళ్లీ యథావిధిగా పునరుద్ధరిస్తున్నట్లు ఫెడరేషన్ అధికారికంగా ప్రకటించింది. డ్యాన్సర్స్ యూనియన్‌లో చోటుచేసుకున్న పరిణామాలపై చర్చించేందుకు ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని నేతృత్వంలో మిగతా 23 క్రాఫ్ట్స్ ప్రతినిధులతో అత్యవసర జనరల్ […] -
Modern Missamma: గోపీ సుందర్ మార్క్ మ్యూజిక్‌తో ‘మోడ్రన్ మిస్సమ్మ’
లాస్య అండ్ మిధున క్రియేషన్స్ పతాకంపై చిరంజీవి పమిడి, శివ పమిడి, కిరణ్ కుమార్ నల్లూరి, స్రవంతి నంబూరి సంయుక్తంగా నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘మోడ్రన్ మిస్సమ్మ’. హర్ష నర్రా, తన్మయి ఖుషి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయిబాబా కథ, స్క్రీన్‌ప్లే సమకూర్చి దర్శకత్వం వహిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్‌ను చిత్ర యూనిట్ ఘనంగా విడుదల చేసింది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ స్వరపరిచిన […] -
Vedha Jalandhar: ‘అమీర్ లోగ్’.. బిర్యానీ చుట్టూ తిరిగే కథ
టాలీవుడ్లో సహజత్వంతో కూడిన కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలకు ఎప్పుడూ ప్రత్యేక ఆదరణ ఉంటుంది. ‘అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్’ పతాకంపై మాధవి రెడ్డి సోమ నిర్మించగా, రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘అమీర్ లోగ్’. మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రాన్ని దగ్గుబాటి రానాకు చెందిన ప్రముఖ సంస్థ ‘స్పిరిట్ మీడియా’ ఆగస్ట్ 21న గ్రాండ్‌గా విడుదల చేస్తోంది. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేధా […] -
Party Movie: అస్తిత్వాల అంతర్మథనం “పార్టీ”
అనుకోకుండా యూట్యూబ్‌లో “పార్టీ” అనే హిందీ సినిమా కనిపించింది. టైటిల్ ఆసక్తిగా అనిపించి, దర్శకుడు ఎవరా అని చూస్తే గోవింద్ నిహలానీ. దాంతో సినిమా మొత్తం చూశాను. ఈ సినిమా గురించి చెప్పే ముందు నిహలానీ గారి గురించి కొంత చెప్పుకోవాలి. ప్రఖ్యాత దర్శకుడు శ్యామ్ బెనగల్ చిత్రాల ఫొటోగ్రాఫర్‌గా నిహలానీ సుపరిచితులు. ఆయన ఒక జాతీయ ఉత్తమ ఛాయాగ్రాహకుడు మాత్రమే కాదు, అనేక జాతీయ అవార్డులు పొందిన గొప్ప దర్శకుడు కూడా. ‘అర్థ సత్య’, ‘ఆక్రోష్’, […] -
Vishwanath & Sons : 4 రోజుల్లో ₹150 కోట్ల మార్క్ దాటిన ‘విశ్వనాథ్ & సన్స్’!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’ (Vishwanath & Sons) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా రిలీజ్ రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకుని అప్రతిహతంగా దూసుకుపోతోంది. ప్రేక్షకుల నుంచి వస్తున్న యునానిమస్ ఆదరణతో ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా […] -
NTR Trivikram: రెండు టైటిళ్లను రిజిస్టర్ చేయించిన ఎన్టీఆర్ ఆర్ట్స్
టాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎదురుచూస్తున్న కాంబినేషన్లలో ఒకటైన ఎన్టీఆర్,త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రాబోతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గురించి సినిమా వర్గాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చ జరుగుతోంది. ‘అరవింద సమేత వీరరాఘవ’ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ […] -
Nayanthara : నయనతార కళ్ళు తెరిపించిన బిజినెస్ ?
రెమ్యునరేషన్ ఇంకో కోటి ఎక్కువ ఇస్తామన్నా నయనతార ప్రమోషన్స్‌కు వచ్చే ప్రసక్తే లేదంటుంది. అసలు సైన్ చేసే ముందే సినిమాకు సంబంధించిన ఎలాంటి ప్రమోషన్స్‌కు రానని, అలాగైతేనే నటిస్తానని ముందే చెప్పేస్తుంది. అందుకు ఓకే అంటేనే అగ్రిమెంట్ మీద సైన్ చేస్తుంది. ముందునుంచీ ఇదే పద్ధతిలో సినిమాలు చేస్తోంది నయన్. అయితే దిగ్గజ దర్శకుడు బాపు డైరెక్టర్ కావడం, ప్రభుదేవాతో పెళ్లి కోసం సినిమాలు మానేయాలి అనుకోవడం, ‘శ్రీరామరాజ్యం’ చివరి సినిమా కావడంతో ప్రమోషన్స్‌కు వచ్చింది నయన్. […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?