SS Thaman: వరుస విజయాలతో సౌత్ ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా తమకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఎస్.ఎస్. తమన్‌ను నిన్నటి వరకు ఆకాశానికి ఎత్తిన వారే, ఇప్పుడు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా నందమూరి అభిమానులు, ప్రభాస్ ఫ్యాన్స్ నుంచే ఈ విమర్శలు అధికంగా వస్తుండటం చర్చనీయాంశంగా మారింది. అసలు తమన్‌పై విమర్శల వెనుక కారణాలేంటి? నందమూరి ఫ్యాన్స్ టార్గెట్ ఎందుకు? అనేది పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. బాలకృష్ణ, తమన్ కాంబోలో వరుసగా నాలుగు హిట్స్ […]
‘ది పెట్ డిటెక్టివ్’. నవంబర్ 28 నుంచి జీ 5లో మలయాళం, తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. ప్రణీష్ విజయన్ దీన్ని తెరకెక్కించారు. ష్రాఫ్ యు దీన్ ప్రధాన పాత్రలో నటించటంతో పాటు నిర్మాతగానూ తొలి అడుగు వేశారు. ఇంకా ఈ చిత్రంలో వినాయకన్, వినయ్ ఫార్ట్, అనుపమ పరమేశ్వరన్, శ్యామ్ మోహన్, జ్యోమన్ జ్యోతిర్ ఇతక పాత్రల్లో నటించారు. Also Read :Jagtial: భార్య చేతిలో మరో భర్త బలి.. రోకలి […]
ప్రముఖ నటుడు, నిర్మాత విశాల్‌కు మద్రాసు హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం విశాల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విశాల్ తన సొంత నిర్మాణంలో వచ్చిన ‘వాగై సూడుం’ చిత్రాన్ని స్వయంగా విడుదల చేయడంతో లైకా ప్రొడక్షన్స్ సంస్థ కోర్టును ఆశ్రయించింది. గతంలో, లైకా సంస్థకు విశాల్ చెల్లించాల్సిన రూ.21.29 కోట్లను 30 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని మద్రాసు […]
NBK 111: నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ 2' (అఖండ సెకండ్ పార్ట్) రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక, అప్పుడే మరో సినిమా కూడా మొదలుపెట్టేశారు బాలకృష్ణ. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఒక సినిమా నేడు ముహూర్తం పూజతో ప్రారంభమైంది. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత వెంకట్ సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మించబోతున్నారు. ఇక, ఈ సినిమా పూజ రోజునే అధికారికంగా అనౌన్స్ చేశారు.
Renu Desai: పవన్ కళ్యాణ్ మాజీ భార్య, ఒకప్పటి హీరోయిన్ రేణు దేశాయ్ ఈ మధ్యకాలంలో సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆమె నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమా పెద్దగా వర్కౌట్ కాకపోవడంతో, ఆమె ఇక సినిమాలు ఒప్పుకోరేమో అని అందరూ అనుకున్నారు. ఇక, ఆ మధ్య ఆమె ఒక కామెడీ ఎంటర్టైనర్ ఫైనల్ చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి. ఒక చిన్న సినిమా అయినా తన పాత్ర నచ్చడంతో ఆమె ఒప్పుకున్నారని అందరూ భావించారు. […]
టాలీవుడ్లో నిర్మాతల కొడుకులు హీరోలుగా మారటం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోంది. ఇప్పటికే అలా చాలామంది హీరోలుగా మారి, సూపర్స్టార్లు కూడా అయ్యారు. ఇప్పుడు తాజాగా మరో నిర్మాత కుమారుడు టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఆ టాలీవుడ్ నిర్మాత మరెవరో కాదు, డి.ఎస్. రావు. నానితో ‘పిల్ల జమీందార్’ సహా, తెలుగులో ఎన్నో సినిమాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. శ్రీనివాసరావు దమ్మాలపాటిని అందరూ డి.ఎస్. రావు అని పిలుస్తూ ఉంటారు. ఆయన కుమారుడు కృష్ణ దమ్మాలపాటి […]
టాలీవుడ్లో విభిన్న సినిమాలు చేస్తూ దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు సంపత్ నంది. తాజాగా, ఆయన ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి, నంది కిష్టయ్య, అనారోగ్య కారణాలతో నిన్న రాత్రి కన్నుమూశారు. ఆయన వయసు 73 సంవత్సరాలు. తెలుగులో సంపత్ నందికి దర్శకుడిగా మంచి పేరుంది. ఆయన చివరిగా దర్శకత్వ పర్యవేక్షణలో ఓదెల 2 (ఓదెల సెకండ్ పార్ట్) రిలీజ్ చేశారు. తమన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇక, […]
Andhra King Thaluka: నవంబర్ 28న విడుదల కాబోతున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ (AKT) సినిమా బాక్సాఫీస్ వద్ద పెను సంచలనం సృష్టించడానికి సిద్ధమైంది. పీక్ ప్రమోషన్స్ తో రామ్ పోతినేని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక తాజాగా సెన్సార్ బోర్డు నుంచి ఈ చిత్రానికి U/A సర్టిఫికేషన్ లభించింది. మొత్తం రన్‌టైమ్ (ప్రకటనలు, టైటిల్స్‌తో సహా) సుమారు 2 గంటల 40 నిమిషాలుగా ఉండటం, ప్రేక్షకులకు ఒక […]
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీనుల శక్తివంతమైన కలయికలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా ‘అఖండ 2: తాండవం’ డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎం. తేజస్విని నందమూరి సగర్వంగా సమర్పిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలు ఇప్పటికే భారీ అంచనాలను పెంచాయి. ఈ […]
పైరసీ కింగ్ ‘ఐబొమ్మ’ (iBOMMA) రవి (ఇమంది రవి)కి సంబంధించిన ఐదు రోజుల పోలీసు కస్టడీ కాసేపట్లో ముగియనుంది. ఈ ఐదు రోజుల విచారణలో సైబర్ క్రైమ్ పోలీసులు రవి నుంచి పలు కీలక విషయాలను రాబట్టినట్లు సమాచారం. న్యాయస్థానం ఆదేశాల మేరకు కస్టడీ ముగియడంతో, పోలీసులు సాయంత్రం 5 గంటలకు రవిని నాంపల్లి కోర్టుకు తీసుకెళ్లనున్నారు. కస్టడీ సమయంలో రవికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు. దాదాపు రూ. 20 కోట్ల […]