మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ టాలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపిస్తుండటంతో ఈ సక్సెస్ మ్యాజిక్ ఇక్కడితో ఆగిపోకూడదని మెగాస్టార్ గట్టిగా నిశ్చయించుకున్నట్లు కనిపిస్తోంది. రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’, ‘వాల్తేరు వీరయ్య’ వంటి భారీ హిట్లు అందుకున్నప్పటికీ, ఆయనలోని వింటేజ్ గ్రేస్‌ను, ఆ కామెడీ టైమింగ్‌ను వెలికితీసిన క్రెడిట్ అనిల్ రావిపూడికే దక్కింది. సినిమా షూటింగ్ సమయంలో చిరు ఎంతగా ఎంజాయ్ చేశారో, ఇప్పుడు రిజల్ట్ చూసి అంతకంటే ఎక్కువ ఆనందంలో ఉన్నారు, అనిల్ పనితీరుకు ఫిదా అయిపోయిన మెగాస్టార్, ఏకంగా ఒక రేంజ్ రోవర్ కారును గిఫ్ట్‌గా ఇచ్చి తన కృతజ్ఞతను చాటుకున్నారు.
Also Read :Mrunal Thakur :ప్రియాంక చోప్రా పై మృణాల్ ఠాకూర్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ వైరల్..!
అనిల్ దర్శకత్వంపై చిరంజీవికి ఎంత నమ్మకం ఏర్పడిందంటే, మైకు పట్టుకున్న ప్రతిసారీ “మనమిద్దరం మళ్ళీ సినిమా చేయాలి” అని బాహాటంగానే తన కోరికను వెల్లడిస్తున్నారు ఎందుకంటే కేవలం 85 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేయడం చిరును ఆశ్చర్యపరిచింది. అంచనాలకు లోబడే సినిమాను పూర్తి చేస్తూనే, క్వాలిటీలో ఎక్కడా తగ్గకపోవడంతో ‘మన శంకరవరప్రసాద్’ ఇప్పటికే 358 కోట్ల గ్రాస్‌తో చిరంజీవి కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. “నువ్వు కథ రెడీ చేయడమే తరువాయి.. మనం మళ్ళీ సెట్స్‌కి వెళ్దాం” అని ప్రీ-రిలీజ్ ఈవెంట్ నుండి సక్సెస్ సెలబ్రేషన్స్ వరకు చిరంజీవి అనిల్‌ను కోరుతూనే ఉన్నారు. అంతేకాకుండా, వెంకటేష్‌తో కలిసి ఒక ఫుల్ లెంగ్త్ మల్టీస్టారర్ చేయాలని కూడా తన మనసులో మాటను బయటపెట్టారు మెగాస్టార్, మరి అనిల్ రావిపూడి మెగాస్టార్ కోసం ఎలాంటి స్క్రిప్ట్ రెడీ చేస్తారో, ఈ కాంబో మళ్ళీ ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందో చూడాలి.