విష్ణు మంచు నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం “కన్నప్ప”కు సంబంధించిన కీలకమైన హార్డ్ డిస్క్ మాయమైన ఘటన సినీ పరిశ్రమలో సంచలనం రేపింది. ఈ సినిమాకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఫైల్స్ ఉన్న హార్డ్ డ్రైవ్ హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్లో మిస్సింగ్ అయినట్లు నిర్మాతలు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదై, విచారణ కొనసాగుతోంది. ముంబైలోని హెచ్ఐవీఈ స్టూడియోస్ నుంచి కన్నప్ప సినిమా యొక్క కీలక విఎఫ్ఎక్స్ కంటెంట్‌ను […]
ప్రముఖ నటుడు కమల్ హాసన్ తన తాజా చిత్రం “తగ్ లైఫ్” విడుదలకు ముందు కొత్త వివాదంలో చిక్కుకున్నారు. చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కన్నడిగుల ఆగ్రహానికి కారణమయ్యాయి. “మీ భాష (కన్నడ) తమిళం నుంచే పుట్టింది” అని కమల్ హాసన్ అనడం కర్ణాటకలో తీవ్ర దుమారం రేపింది. కమల్ హాసన్ తన ప్రసంగాన్ని “ఉయిరే ఉరవే తమిళే” (నా ప్రాణం, నా బంధుత్వం తమిళం) అంటూ ప్రారంభించారు. ఆ తర్వాత, వేదికపై […]
యూరప్ హాలిడే కోసం వెళ్ళిన ప్రభాస్ ఎట్టకేలకు తిరిగి వచ్చాడు. ఆయన వచ్చి రాగానే హను రాఘవపూడి డైరెక్షన్లో రూపొందుతున్న ఫౌజీ సినిమా షూటింగ్లో పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా స్వాతంత్ర్యానికి పూర్వం రాసుకున్న కథతో తెరకెక్కిస్తున్నారు. ఒక పీరియాడిక్ సెటప్ సిద్ధం చేశారు. ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ప్రభాస్ మీద కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు సినిమా టీం. Also Read:OG Shooting: OG షూటింగ్లో పవన్ […]
ఒకపక్క రాజకీయాలతో బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ మరోపక్క సినిమాల మీద కూడా ఫోకస్ పెట్టారు. ఆయన రాజకీయాల్లో బిజీ అవ్వకముందు మొదలుపెట్టిన సినిమాలను ఇప్పుడు పూర్తి చేసి రిలీజ్ చేసే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఆయన హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేశారు. ఆ సినిమా వచ్చే నెల 12వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతోంది. ఇక ఇప్పుడు ఆయన ముంబైలో ఓజీ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. Also Read:Sandeep vs Deepika: స్పిరిట్ […]
అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ అనిపించుకున్న సందీప్ రెడ్డి వంగా అనూహ్యంగా వార్తల్లోకి వచ్చాడు. నిజానికి స్పిరిట్ సినిమా నుంచి దీపికా తప్పుకుందనే వార్త ముందు వెలుగులోకి వచ్చింది. దానికి దీపికా పెట్టిన కొన్ని కండిషన్స్ కారణమని కూడా అన్నారు. దీపికా పెట్టిన కండిషన్స్ నచ్చకపోవడంతో ఆమెను ప్రాజెక్టు నుంచి వెళ్లిపోమని కోరారని, దాంతో ఆమె వెళ్లిపోయిందని బయటకు తెలిసింది. అంతేకాదు, అనిమల్ సినిమాలో సెకండ్ హీరోయిన్ లాంటి పాత్రలో బోల్డ్ క్యారెక్టర్లో […]
జనసేన పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తూగో జిల్లా సినీ డిస్ట్రిబ్యూటర్, అనుశ్రీ ఫిలిమ్స్ అధినేత అత్తి సత్యనారాయణ రాజమండ్రిలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజుపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, తనపై వచ్చిన ఆరోపణలు పూర్తిగా అబద్ధమని, ఇదంతా దిల్ రాజు కుట్రలో భాగమని ఆరోపించారు. సినిమా థియేటర్ల బంద్ విషయంలో తన పేరును దురుద్దేశంతో లాగారని, ఈ వివాదం వెనుక దిల్ రాజు, అతని సోదరుడు శిరీష్ రెడ్డి, సురేష్ […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లలో రెవెన్యూ, పోలీసు, అగ్నిమాపక శాఖల అధికారులు సంయుక్తంగా విస్తృత తనిఖీలు చేపట్టారు. డిప్యూటీ సీఎం, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లు, మల్టీప్లెక్స్‌లతో కలిపి 1300కు పైగా థియేటర్లలో ప్రేక్షకులకు అందుబాటులో ఉన్న వసతులు, శుభ్రత, ఆహార పదార్థాల ధరలు, ఫైర్ సేఫ్టీ వంటి 32 అంశాలపై అధికారులు పరిశీలన చేస్తున్నారు. ఈ తనిఖీలు రాష్ట్రవ్యాప్తంగా నెల్లూరు, కృష్ణా, […]
ప్రముఖ సినీ నటుడు మంచు విష్ణు 2019 ఎన్నికల సమయంలో తనపై నమోదైన ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసును కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం, జస్టిస్ బీ.వీ. నాగరత్న నేతృత్వంలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 15, 2025కి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. 2019 సాధారణ ఎన్నికల సమయంలో మంచు విష్ణు ఎన్నికల నీతి నియమావళిని ఉల్లంఘించారన్న ఆరోపణలతో కేసు నమోదైంది. ఈ కేసు […]
ప్రస్తుతం టాలీవుడ్లో చక్రం తిప్పేందుకు ప్రయత్నిస్తున్న యువ నిర్మాత నాగ వంశీ. తెలుగుదేశం పార్టీకి ఏకంగా పాతిక లక్షల విరాళం ఇవ్వడం ఆసక్తి రేపుతోంది. నాగ వంశీ విరాళం ఇచ్చిన విషయాన్ని స్వయంగా చంద్రబాబు మహానాడు వేదికగా ప్రకటించారు. ప్రతి సంవత్సరం తెలుగుదేశం పార్టీ మహానాడు పేరుతో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటూ ఉంటుంది. ఈ ఏడాది మహానాడు వేడుకలను కడప జిల్లాలో నిర్వహిస్తున్నారు. నిన్నటి నుండి ప్రారంభమైన ఈ వేడుకలలో చంద్రబాబు తెలుగుదేశం […]
గుంటూరు కారం సినిమా తర్వాత మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమా టైటిల్ ఫిక్స్ చేయలేదు. SSMB 29 పేరుతో ఈ సినిమాని సంబోధిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి సమ్మర్ బ్రేక్ ఇచ్చారు. ఎప్పటిలాగే మహేష్ బాబు వెకేషన్‌కి వెళ్లిపోయాడు. ఆయన తిరిగి వచ్చిన తర్వాత మళ్లీ షెడ్యూల్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు […]