తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 2024 వరకు విడుదలైన సినిమాల కోసం ప్రతిష్ఠాత్మక గద్దర్ సినీ పురస్కారాలను ప్రకటించింది. ప్రతి ఏడాదికి ప్రథమ, ద్వితీయ, తృతీయ ఉత్తమ చిత్రాలను ఎంపిక చేస్తూ ఈ అవార్డులను అందజేస్తోంది. 2014 సంవత్సరానికి గాను ‘పాఠశాల’ చిత్రం సెకండ్ బెస్ట్ ఫిల్మ్‌గా ఎంపికైంది. రాకేశ్ మహాంకాళి, పవన్ కుమార్ రెడ్డి నిర్మాణంలో మాహి వి. రాఘవ దర్శకత్వంలో రూపొందిన ‘పాఠశాల’ చిత్రం, ఐదుగురు మిత్రులు ఐదు వారాల పాటు 5000 […]
టాలీవుడ్లో భారీ అంచనాలతో రూపొందుతున్న పాన్-ఇండియా చిత్రం ‘కన్నప్ప’ సినిమా విడుదలకు ముందే ఊహించని సమస్యల్లో చిక్కుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన కీలకమైన హార్డ్ డ్రైవ్ మాయమైన వ్యవహారం సినీ వర్గాల్లో సంచలనం రేపింది. ముంబైలోని హైవ్ స్టూడియోస్ నుంచి డీటీడీసీ కొరియర్ ద్వారా హైదరాబాద్‌లోని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ కార్యాలయానికి పంపిన హార్డ్ డ్రైవ్ ఆఫీస్ బాయ్ రఘు ద్వారా చరిత అనే యువతికి అప్పగించబడింది. అయితే, ఆ తర్వాత చరిత కనిపించకుండా పోయింది. 24 […]
ఐపీఎల్ టైటిల్ సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలికేందుకు ఈ సారి ఆర్సీబీకి సువర్ణావకాశం లభించింది. మొదటి క్వాలిఫయర్‌లో పంజాబ్‌ను ఓడించడం ద్వారా RCB నాలుగోసారి ఫైనల్‌కు చేరుకుంది.పంజాబ్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆర్సీబీ 9 సంవత్సరాల తర్వాత ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంది. టైటిల్ రేసులో మిగతా జట్లు ఉన్నా.. అందరి చూపు ఆర్సీబీ మీదే ఉంది. టైటిల్ కోసం ఆర్సీబీ యాజమాన్యం ఎంతగా ఎదురుచూస్తుందో.. ఫ్యాన్స్ అంతకన్నా ఎక్కువే ఆరాటపడుతున్నారు. కోహ్లీ కోసమే […]
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సవాలాత్మక పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి వరలక్ష్మి శరత్ కుమార్, బ్లాక్‌బస్టర్ చిత్రాలతో స్టార్ స్థాయికి చేరుకుంది. ఆమె తాజాగా తెలుగులో ‘పోలీస్ కంప్లెయింట్’ అనే సినిమా చేస్తోంది. సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో వరలక్ష్మి శక్తివంతమైన పాత్రతో పాటు, తొలిసారి పూర్తిగా వినోదాత్మకమైన రోల్లో కనిపించనుంది. ఈ చిత్రంలో సూపర్ స్టార్ […]
స్వర్గీయ నందమూరి తారకరామారావు 102వ జయంతి సందర్భంగా, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సమర్పణలో, ప్రముఖ సంస్థ కళావేదిక నిర్వహణలో హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో సీబీజె కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. సీనియర్ నిర్మాత శ్రీ ఆర్వీ రమణమూర్తి గారి ఆశయ సాధన కోసం అహర్నిశలు శ్రమిస్తున్న భువన రాయవరపు సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరం ప్రత్యేకంగా ‘ఎన్టీఆర్ దేశ్ రక్షక్ అవార్డులు’ను త్రివిధ దళాలకు చెందిన సైనిక […]
ఈ రోజుల్లో ఒక సినిమా తీయాలంటే తక్కువలో తక్కువ 70 నుంచి 90 రోజులు పడుతుంది. అది అత్యంత తక్కువ వర్కింగ్ డేస్ అని చెప్పొచ్చు. కానీ ఒకానొక సమయంలో కేవలం 15 రోజుల్లోనే ఒక సినిమా తీసి రిలీజ్ చేస్తే, అది తెలుగులో ఏడాది ఆడడమే కాదు, కన్నడ, మరాఠీ భాషల్లో సైతం రీమేక్ అయింది. ఆ సినిమా మరేమిటో కాదు, రాజేంద్రప్రసాద్ హీరోగా, దివ్యవాణి హీరోయిన్గా నటించిన ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం. Also […]
అర్ధనారి, తెప్ప సముద్రం, వెడ్డింగ్ డైరీస్ వంటి వైవిధ్యమైన చిత్రాల్లో హీరోగా నటించి ప్రేక్షకులను అలరించిన అర్జున్ అంబటి, ‘బిగ్ బాస్’ రియాలిటీ షో ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా సుపరిచితుడయ్యాడు. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘పరమపద సోపానం’. ఈ సినిమాలో జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ కథానాయికగా నటిస్తుంది. ‘ఎస్.ఎస్.మీడియా’ సంస్థ బ్యానర్‌పై గుడిమిట్ల సువర్ణలత సమర్పణలో, గుడిమిట్ల శివ ప్రసాద్ నిర్మాతగా, గుడిమిట్ల ఈశ్వర్ సహ నిర్మాతగా వ్యవహరించారు. స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ […]
పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో రూపొందిన ‘8 వసంతాలు’ ఒక కాన్సెప్ట్ ఆధారిత చిత్రం. ఈ సినిమాలో అనంతిక సనీల్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం హృదయాన్ని తడమబోయే సినిమాటిక్ అనుభవాన్ని అందించనుందని ప్రోమోలు సూచిస్తున్నాయి. ఈ వర్షాకాలంలో ‘8 వసంతాలు’ను థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు. జూన్ 20, 2025న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు […]
నటి, నిర్మాత నిహారిక కొణిదెలకు సినిమా పట్ల ఉన్న అభిరుచి అందరికీ సుపరిచితం. ఆమె నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రం ఆగస్టు 9, 2024న విడుదలై ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. థియేటర్లలోనూ, ఓటీటీలోనూ ఈ చిత్రం అద్భుతమైన ఆదరణ పొందింది. తాజాగా, ఈ సినిమా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్ళు’ రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులను గెలుచుకుంది. Also Read:Yamudu: ఆసక్తి రేపుతున్న […]
ప్రస్తుతం ఆడియెన్స్ సాధారణ కమర్షియల్, లవ్, యాక్షన్ చిత్రాల కంటే కాన్సెప్ట్ ఆధారిత సినిమాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ ధోరణిలోనే ఓ కొత్త మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ చిత్రం ‘యముడు’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జగన్నాధ పిక్చర్స్ బ్యానర్‌పై జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ‘ధర్మో రక్షతి రక్షితః’ అనే ఉపశీర్షికతో రూపొందుతోంది. ఈ సినిమాలో శ్రావణి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన […]