పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మొదటి షో మరో రెండు గంటల్లో పడబోతోంది. అయితే హైదరాబాద్ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి రాత్రి 9 గంటల ముప్పై ఆరు నిమిషాల తర్వాత స్పెషల్ షో ప్లాన్ చేశారు. ఈ స్పెషల్ షోలకు 700కు పైగా టికెట్ రేట్లు అమ్ముతున్నారు. అయినా సరే ఏమాత్రం తగ్గకుండా సోల్డ్ అవుట్. పెట్టినవి పెట్టినట్లు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసేసుకుంటున్నారు ఆడియన్స్. నిజానికి ముందుగా సింగిల్ స్క్రీన్ మాత్రమే హైదరాబాదులో ఓపెన్ చేశారు.
Also Read : HHVM : గురువు సత్యానంద్ కు పాదాభివందనం చేసిన పవన్..
అవి ఓపెన్ చేసిన సెకన్లలోనే బుకింగ్స్‌తో హౌస్ ఫుల్ అయ్యాయి. ఇప్పుడు ఒక్కటొక్కటిగా మల్టీప్లెక్స్ యాడ్ చేస్తున్న కొద్దీ అవి కూడా హౌస్‌ఫుల్ దిశగా పరుగులు పెడుతున్నాయి. హరిహర వీరమల్లు ఓపెనింగ్ గట్టిగానే కనిపిస్తోంది. కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినా సరే ఈ సినిమా బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకుపోయే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ సినిమా మీద అంతా పాజిటివ్‌గానే ఉంది. పవన్ కళ్యాణ్ చివరి నిమిషంలో వచ్చి ప్రమోషన్స్ చేయడంతో ఆయన అభిమానులు మాత్రమే కాదు, సినీ అభిమానులు సైతం ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.