పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో రూపొందిన ‘8 వసంతాలు’ ఒక కాన్సెప్ట్ ఆధారిత చిత్రం. ఈ సినిమాలో అనంతిక సనీల్‌కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రం హృదయాన్ని తడమబోయే సినిమాటిక్ అనుభవాన్ని అందించనుందని ప్రోమోలు సూచిస్తున్నాయి. ఈ వర్షాకాలంలో ‘8 వసంతాలు’ను థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు. జూన్ 20, 2025న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు […]
నటి, నిర్మాత నిహారిక కొణిదెలకు సినిమా పట్ల ఉన్న అభిరుచి అందరికీ సుపరిచితం. ఆమె నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రం ఆగస్టు 9, 2024న విడుదలై ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. థియేటర్లలోనూ, ఓటీటీలోనూ ఈ చిత్రం అద్భుతమైన ఆదరణ పొందింది. తాజాగా, ఈ సినిమా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్ళు’ రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులను గెలుచుకుంది. Also Read:Yamudu: ఆసక్తి రేపుతున్న […]
ప్రస్తుతం ఆడియెన్స్ సాధారణ కమర్షియల్, లవ్, యాక్షన్ చిత్రాల కంటే కాన్సెప్ట్ ఆధారిత సినిమాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ ధోరణిలోనే ఓ కొత్త మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ చిత్రం ‘యముడు’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జగన్నాధ పిక్చర్స్ బ్యానర్‌పై జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వయంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ‘ధర్మో రక్షతి రక్షితః’ అనే ఉపశీర్షికతో రూపొందుతోంది. ఈ సినిమాలో శ్రావణి శెట్టి కథానాయికగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన […]
అసలే ఇబ్బందులు పడుతున్న ఓజి సినిమా టీమ్‌కి మరో షాక్ తగిలింది. ఎంతో కాలం గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ ఈ మధ్యనే ఓజి సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. అయితే ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న ఇమ్రాన్ హష్మీ డెంగ్యూ బారిన పడ్డాడు. ఈ నేపథ్యంలో ఆయన సినిమా నుంచి బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఓజి సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో అనారోగ్యం వల్ల ఆయనను హాస్పిటల్‌కి తీసుకువెళ్లారు. Also Read:Sreeleela: ‘ఉస్తాద్’ కోసం […]
యంగ్ హీరోయిన్ శ్రీ లీల టైం ఏమాత్రం బాగాలేదు. ఆమె చేస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. ప్రస్తుతానికి ఆమె చేతిలో ఉన్న ఏకైక బడా ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్ హీరోగా హరిశంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ గతంలో కొంత భాగం జరిగింది. 2023లో షూటింగ్ మొదలైనప్పుడు శ్రీలీల కూడా పాల్గొంది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ కారణంగా ఈ సినిమా పూర్తిగా నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. అనేక వాయిదాల తర్వాత ఈ చిత్రం జూన్ 12, 2025న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. 17వ శతాబ్దం నేపథ్యంలో రూపొందుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా, పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓ అద్భుతమైన విజువల్ ట్రీట్‌ను అందించనుంది. తాజాగా, పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులను పూర్తి చేశారు. ఆయన బిజీ షెడ్యూల్‌ను బ్యాలెన్స్ […]
భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం ‘రామాయణం’ ఇప్పుడు ప్రేక్షకుల అంచనాలను ఆకాశానికి తాకేలా చేస్తోంది. ‘రాకింగ్ స్టార్’ యష్, ఈ భారీ చిత్రంలో రావణుని పాత్రలో సన్నద్ధమవుతున్నారు. హాలీవుడ్లో పేరొందిన స్టంట్ దర్శకుడు గై నోరిస్‌తో కలిసి, ఆయన ఈ చిత్రంలోని ఉద్విగ్న యాక్షన్ దృశ్యాలను అద్వితీయంగా రూపొందిస్తున్నారు. ‘మాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్’, ‘ది సుసైడ్ స్క్వాడ్’ వంటి హాలీవుడ్ బ్లాక్‌బస్టర్ చిత్రాలకు స్టంట్ దర్శకత్వం వహించిన గై నోరిస్, ఇప్పుడు ‘రామాయణం’ […]
టాలీవుడ్ ఇప్పుడు ప్రపంచ స్థాయి సినిమా పరిశ్రమగా ఎదిగిన విషయం అందరికీ తెలిసిందే. టాలీవుడ్ నుంచి వచ్చే సినిమాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇలాంటి సమయంలో టాలీవుడ్లో కొత్తగా ఓ నిర్మాణ సంస్థ పుట్టబోతోంది. ‘సోమో ఐరానిక్ ఆర్ట్ క్రియేషన్స్’ పేరుతో ఈ కొత్త ప్రొడక్షన్ హౌస్ ఆవిర్భవిస్తోంది. గురువారం నాడు ఈ బ్యానర్ లోగోను ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం ‘సోమో ఐరానిక్ ఆర్ట్ క్రియేషన్స్’ అధినేత జేజే మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను పంచుకున్నారు. […]
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగు జాతి ఆత్మగౌరవ స్ఫూర్తి నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) 102వ జయంతి నేడు ఘనంగా జరిగింది. తెలుగు ప్రజలు ఈ రోజును సందడిగా జరుపుకున్నారు. హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్లో శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, ఆయన జయంతిని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన వేడుకల్లో సినీ ప్రముఖులు, అభిమానులు, రాజకీయ నాయకులు పాల్గొని ఆయనకు నివాళులు అర్పించారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ…సీనియర్ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఈ […]
దేశం పట్ల ప్రేమ కలిగి ఉండటం ఒక విషయమైతే, ఆ ప్రేమను ప్రజలకు ఉపయోగపడేలా ఒక రూపంలో వ్యక్తపరచడం సామాన్యమైన విషయం కాదు. ఇటీవల మన దేశ పౌరులపై జరిగిన దాడులకు ప్రతిస్పందనగా, మన జవాన్లు పాకిస్తాన్ టెర్రరిస్ట్ క్యాంపులపై నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ను ప్రేరణగా తీసుకుని, ప్రముఖ ఆరోగ్య డైట్ నిపుణులు లక్ష్మణ్ పూడి ఒక దేశభక్తి గీతాన్ని రూపొందించారు. ఈ పాట ద్వారా తన దేశభక్తిని వ్యక్తపరిచిన లక్ష్మణ్, స్వీయ దర్శకత్వంలో నటిస్తూ, స్వరం […]