ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తోంది. బుచ్చిబాబు, జాన్వీ కపూర్ కలిసి నిన్న ఏఎంబీ థియేటర్‌లో కెమెరా కంటికి చిక్కారు. నిజానికి వీరిద్దరూ హరిహర వీరమల్లు సినిమా చూసేందుకు అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. వీరిద్దరి ఫోటోలను ఏఎంబీ థియేటర్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌లో పోస్ట్ చేశారు.
ALso Read:Thailand: రోజూ ఫుడ్‌కి బదులుగా బీరు తాగి కడుపు నింపుకున్నాడు.. నెల గడిచాక…
అయితే, వీరిద్దరూ హరిహర వీరమల్లు సినిమాకి వెళ్లి ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది, కానీ థియేటర్ సోషల్ మీడియా హ్యాండిల్‌లో గానీ, జాన్వీ కపూర్, బుచ్చిబాబు సోషల్ మీడియా హ్యాండిల్‌లో గానీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే, నిన్న థియేటర్‌లలో కేవలం హరిహర వీరమల్లు మాత్రమే రిలీజ్ అయినందున, వారు ఆ సినిమాకి వెళ్లి ఉండవచ్చని అంటున్నారు.
ALso Read:Vishwambhara: కీరవాణి ఉండగా భీమ్స్ స్పెషల్ సాంగ్.. ఎందుకో తెలుసా?
ఇక హరిహర వీరమల్లు సినిమా విషయానికి వస్తే, పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. గురువారం నాడు రిలీజ్ అని ప్రకటించినా, బుధవారం నాడే ప్రీమియర్‌లు వేశారు. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ఓపెనింగ్స్ మాత్రం ఆకట్టుకునేలా ఉన్నాయి. పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ తెచ్చిన సినిమాగా ఈ సినిమా నిలిచే అవకాశం కనిపిస్తోంది. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు, కానీ సుమారు 45 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.