Kishan Reddy: సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. మూసీ పక్కన ఉన్న దేవాలయాలను కూల్చే దమ్ము ఉందా ? అని ప్రశ్నించారు. మూసీ పరివాహ ప్రాంతం గురించి రేవంత్ కి తెలుసా ? అని తెలిపారు.
Vikarabad Farmers: వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఫార్మా భూ రైతులు ఆందోళన చేపట్టారు. రోటి బండ తాండలో కాంగ్రేస్ పార్టీ అధ్యక్షుడిని నిర్భందించారు.
Hyderabad: హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. ఇవాళ అమీర్ పేట్ లోని పలు స్వీట్ షాప్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు.
Adilabad: ఆదిలాబాద్ జిల్లా మార్కెట్ యార్డ్ లో నేటి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. మార్కెట్ యార్డ్ లో ఉదయం 10 గంటలకు పత్తి కొనుగోలును అధికారులు ప్రారంభించారు.
BJP Maha Dharna: హైదరాబాద్ ఇందిరా పార్క్ వేదికగా బీజేపీ మహా ధర్నా చేపట్టనుంది. మూసీ పునరుద్ధరణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఇందిరాపార్కు వద్ద తెలంగాణ బీజేపీ నిరసనకు పిలుపునిచ్చింది.