Kishan Reddy: సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. మూసీ పక్కన ఉన్న దేవాలయాలను కూల్చే దమ్ము ఉందా ? అని ప్రశ్నించారు. మూసీ పరివాహ ప్రాంతం గురించి రేవంత్ కి తెలుసా ? అని తెలిపారు. మూసీ పక్కన అనేక మైసమ్మ దేవాలయాలు, పోచమ్మ దేవాలయాలు, ముత్యాలమ్మ దేవాలయాలు అనేకం ఉన్నాయని అన్నారు. ఏది ముఖ్యం ? సీఎంకు అని కిషన్ రెడ్డి మండిపడ్డారు. మూసీ సుందరీకరణ ముఖ్యమా ? కాలనీల్లో రోడ్లు వేయడం ముఖ్యమా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రేటర్ మున్సిపాలిటీకి, వాటర్ బోర్డ్ కి వీధి లైట్లకు డబ్బులు లేవుగానీ.. లక్ష యాభై వేల కోట్ల అప్పు తెచ్చి మూసీ సుందరీకరణ అవసరమా ? అని ప్రశ్నించారు. మూసీ పక్కన అంతర్జాతీయ స్థాయిలో బస్టాండ్, అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయన్నారు.
Read also: Vikarabad Farmers: దుద్యాల మండలంలో ఉద్రిక్తత.. ఫార్మా భూ రైతుల ఆందోళన..
మూసీ పక్కన ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్, మెట్రో స్టేషన్ల పరిస్థితి ఎంటి ? అన్నారు. పేదల మీద ప్రతాపం ఎందుకు రేవంత్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసి ప్రక్షాళన కు, మూసి సుందరీకరణకు బీజేపీ వ్యతిరేకం కాదని స్పష్టం చేసిందని తెలిపారు. పేదల కూడు గూడు కూలుస్తమంటే ఒప్పుకోమన్నారు. రేవంత్ రెడ్డి కి అర్థరాత్రి కల పడ్డది… లక్ష 50 వేల కోట్ల మీద కల పడ్డదేమో అంటూ సంచలన వ్యాక్యలు చేశారు. రేవంత్ రెడ్డి సవాల్ ను స్వీకరిస్తున్నమని తెలిపారు. పేద ప్రజల కోసం వాళ్ళ ఇళ్ళల్లో ఉండేందుకు బీజేపీ నేతలు సిద్దమన్నారు. జైళ్లకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.
Read also: Hyderabad: అమీర్ పేట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు.. ఎక్స్పైర్ అయినా సర్టిఫికెట్స్ తో..
మాకు వాసన వస్తుందని మూసి పరివాహక ప్రజలు ఎవరైనా వెళ్లి రేవంత్ రెడ్డీ నీ వెళ్లి అడిగారా… (ప్రజల నుండి మేము అడగలేదు అని సమాధానం) అని తెలిపారు. రేవంత్ రెడ్డి అక్కడ ప్రజల దగ్గరకి వెళ్లి మాట్లాడాలని కోరారు. మూసి కి ఇరువైపులా రెటైనింగ్ వాల్ కట్టాలని తెలిపారు. మూసి పరివాహక ప్రాంత ప్రజలు కంటి.మీద కునుకు లేకుండా బతుకుతున్నారు, తినలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజలకు అండగా బీజేపీ ఉంటుందన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకి ఎన్నో హామీలు ఇచ్చిందని తెలిపారు. 6 గ్యారంటీల పేరుతో రేవంత్ రెడ్డీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ప్రజలను మభ్య పెట్టారని మండిపడ్డారు. మసిపూసి మారేడు కాయ చేసి అధికారంలోకి కాంగ్రెస్ వచ్చిందని తెలిపారు. కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు.
CM Revanth Reddy: బాపూ ఘాట్ ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసి తీరుతాం..