Kishan Reddy: బీజేపీ అధికారం లోకి రాక పోతే రాష్ట్రము అధోగతి పాలు అవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. వరి ధాన్యం మద్దతు ధర 3,100 కు కొంటామన్నారు. రైతుల నుండి భారీ స్పందన వస్తుందన్నారు.
Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇంటింటి ఓట్ల కోసం ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పన్నెండు సంఘాలకు ఇంటి నుంచే ఓటు వేసే కొత్త విధానాన్ని ఎన్నికల సంఘం ప్రారంభించింది.
Bandi Sanjay: ఫస్ట్ కు జీతాలే ఇవ్వలేని కేసీఆర్ కు మళ్లీ అధికారిమిస్తే అంతే సంగతులు అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Kishan Reddy: నిశబ్ద విప్లవం రానుందని.. యూత్ బీజేపీకి మద్దతు ఇస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ అభ్యర్థులకు మంచి ఆదరణ లభిస్తోందని తెలిపారు.
CM KCR: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎన్నికల ప్రచారానికి వినియోగించిన బస్సును సోమవారం కేంద్ర ఎన్నికల బలగాలు తనిఖీలు చేశాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లా మాన్‌కొండూరులో నిర్వహించనున్న బీఆర్‌ఎస్ జన్ ఆశీర్వాద సభకు హాజరుకానున్నారు.
Harish Rao: బీజేపీ మాటలు నీటి మీద రాతలని.. అందుకే ఆ నలుగురు పార్టీకి టాటా చెప్పారని మంత్రి హరీష్ రావ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటనలో మాట్లాడుతూ.. గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ తరపున హరీష్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Vijayashanthi: బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి త్వరలో ఆ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. ఖమ్మం, మహబూబాబాద్, హైదరాబాద్ శివారులోని నియోజకవర్గాల్లో ఆమె ప్రచారం చేయనున్నారు.
Minister KTR: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ప్రచారం కింద బీఆర్‌ఎస్ మిర్యాలగూడ అభ్యర్థి నల్లమోతు భాస్కర్‌రావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు.
Revanth Reddy: ఒకవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇకపై ప్రతిరోజు కేవలం 3 అసెంబ్లీ నియోజకవర్గాలకే పరిమితం అవుతున్న ఈ ప్రచారం కాంగ్రెస్ వర్గాలలో ఉత్సాహాన్ని పెంచుతోంది.
CM KCR: సీఎం కేసీఆర్ ఇవాళ స్టేషన్‌ఘన్‌పూర్‌కు రానున్నారు. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు హైదరాబాద్-వరంగల్ హైవేలోని మేడికొండ క్రాస్ రోడ్డు వద్ద శివారెడ్డిపల్లి శివారులో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.