Harish Rao: బీజేపీ మాటలు నీటి మీద రాతలని.. అందుకే ఆ నలుగురు పార్టీకి టాటా చెప్పారని మంత్రి హరీష్ రావ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటనలో మాట్లాడుతూ.. గజ్వేల్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ తరపున హరీష్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ నాయకులు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీపై సొంత పార్టీ నాయకులకే నమ్మకం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పార్టీ తెలంగాణలో గెలవదని తెలిసి.. రోజుకో నాయకుడు పార్టీ వీడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయశాంతి, వివేక్, రాజగోపాల్ రెడ్డి, చంద్రశేఖర్ లాంటి నాయకులు పార్టీకి టాటా చెప్పారని గుర్తు చేశారు. బీజేపీ చెప్పే మాటలు నీటి మీద రాతలని అన్నారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నేరవేర్చలేదని మండిపడ్డారు. చేతల నాయకుడు కావాలా? మాయమాటలు చెప్పే నాయకుడు కావాలా? దుబ్బాక ప్రజలు తేల్చుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఇచ్చిన 5 గ్యారెంటీలు నెరవేర్చలేదు కానీ.. ఇక్కడ 6 గ్యారెంటీలు అంటూ చెబుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి బిల్లు ఆమోదించాలని కేంద్రానికి పంపామన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నో ఏళ్ల కోరిక ఇదన్నారు. దీన్ని పరిష్కరించాలని స్వయంగా ప్రధాన మంత్రిని కలవడం జరిగిందన్నారు. రెండవసారి కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి వెంటనే వర్గీకరణ పూర్తి చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేయడం జరిగిందన్నారు. కేంద్రం 9 ఏళ్లు నానబెట్టి ఎన్నికల వేళ కొత్త కమిటీ అని చెబుతున్నారని తెలిపారు. మనకు కావల్సింది కమిటీ కాదు బిల్లు పెట్టాలన్నారు. మా బీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా మద్దతు ఇస్తామన్నారు. ఇన్నేళ్లు గుర్తు రాలేదు ఎన్నికలు ఉన్నాయని మాట్లాడటం మీ స్థాయికి తగదన్నారు. ఇప్పటికైనా మాకు రాజకీయాల కంటే వర్గీకరణ ముఖ్యం. బిల్లు పెట్టాలి తక్షణమే వర్గీకరణ అంశాన్ని పూర్తి చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుందని, వర్గీకరణ తప్పకుండా చేసి తీరుతామన్నారు. వర్గీకరణకు సంబంధించి సంపూర్ణ సహకారం మా బీఆర్ఎస్ పార్టీ అందిస్తుందన్నారు. ఎంఆర్పిఎస్ తమ్ముళ్లకు నా పూర్తి సహకారం ఉంటుందని, నా గుండెల్లో పెట్టుకుంటా అన్నారు.
Inaya Sulthana: మేకప్ లేకుండా హాట్ అందాలతో పిచ్చెక్కిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ..