CM Chandrababu: అమరావతి 2.0 ఇంటిగ్రేటేడ్ మాస్టర్ ప్లాన్ పై సీఎం సమీక్ష.. ప్రపంచస్థాయి నగరంగా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు వచ్చి నివసించేలా రాజధాని అమరావతి ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్ ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఆర్థికాభివృద్ధికి కేంద్ర బిందువుగా నిలిచే ప్రపంచ స్థాయి నగరంగా.. అమరావతి–2.0 ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్, రెండో విడత.. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ LPS-2 రూపకల్పన పనుల పురోగతిపై అధికారులు, సింగపూర్ ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సింగపూర్ ప్రతినిధులు ప్రాజెక్టు పరిధి, అమలు ప్రణాళిక, దశలవారీ కార్యాచరణను ముఖ్యమంత్రికి వివరించారు. ఏరియా ప్లాన్, మౌలిక వసతుల ప్రణాళిక, పెట్టుబడి నమూనా వంటి అంశాలను ప్రాజెక్టులో భాగం చేస్తున్నట్టు తెలిపారు.
ఉద్యోగాలు కల్పించేలా అమరావతి ఆర్ధిక వ్యవస్థ బలోపేతం కావాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లతో అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా నిర్మిస్తున్నామని… ఎల్‌నినోతో సమస్య తలెత్తినా… పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణా నదికి తీసుకురావడంతో రాజధాని ప్రాంతం జల వనరులతో కళకళలాడుతోందని చెప్పారు. అమరావతిని ఆర్ధికంగా బలోపేతం చేసేలా క్రియేటివ్ సిటీ నిర్మాణం చేయాల్సి ఉందన్నారు. గ్లోబల్ బెంచ్ మార్కింగ్ చేరుకోవడం, అత్యధిక తలసరి ఆదాయం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు వివరించారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ బిల్డింగ్ విధానంతో పర్యావరణ అనుకూల విధానాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు… ఈ సమీక్షకు మంత్రి పి.నారాయణ, పురపాలక, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శులు సురేశ్ కుమార్, పీయూష్ కుమార్ సహా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Also Read
- Polavaram Hydel Project: పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలక ముందడుగు..
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
తాజావార్తలు
-
Virat Kohli – Rohit Sharma: 2027 వరల్డ్‌కప్‌కు ముందు రోహిత్-విరాట్‌పై కైఫ్ కీలక వ్యాఖ్యలు
-
Matrubhoomi: నవంబర్ 13న మాతృభూమి రిలీజ్ సాధ్యమా?
-
British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
-
Polavaram Hydel Project: పోలవరం జల విద్యుత్ కేంద్రంలో కీలక ముందడుగు..
-
BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!