Vijayasai Reddy: తారకరత్నను పరామర్శించిన విజయసాయిరెడ్డి.. బాలకృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YSRCP MP Vijayasai Reddy Visits Taraka Ratna: నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్నను పరామర్శించారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి.. ఇవాళ బెంగళూరు వెళ్లిన ఆయన.. ఆస్పత్రిలో తారకరత్నను పరామర్శించారు.. వైద్యులను అడిగి.. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.. అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి.. తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.. 45 నిమిషాలు గుండె ఆగిపోవడం వలన మెదడులో పైభాగం దెబ్బతింది.. దానివలన మెదడులో నీరు చేరి మెదడు వాచినట్టు తెలిపారు.. అయితే, వాపు తగ్గిన వెంటనే బ్రెయిన్ రికవరీ అవుతుందని డాక్టర్లు చెప్పినట్టు సాయిరెడ్డి వివరించారు..
Read Also: Nandamuri Balakrishna: తారకరత్న చెవిలో బాలయ్య ‘మృత్యుంజయ మంత్రం’!
Also Read
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
- AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
- Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
మరోవైపు నందమూరి బాలకృష్ణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు విజయసాయిరెడ్డి.. బాలకృష్ణ దగ్గరుండి తారకరత్నకు అన్ని వైద్యసదుపాయాలు కల్పించారని తెలిపిన ఆయన.. ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.. ఇక, మెదడుపై భాగం దెబ్బతినడంతో కొన్ని అవయవాలు కొంత యాక్టీవ్ గా పనిచేయడంలేదని డాక్టర్లు తెలిపారని.. గుండె బాగానే పనిచేస్తుందని.. తారకరత్న త్వరలోనే కోలుకుంటారని వెల్లడించారు విజయసాయిరెడ్డి. కాగా, తారకరత్నకు విజయసాయిరెడ్డి స్వయానా మామ అవుతారనే విషయం విదితమే.. తారకరత్న 2012లో ప్రేమ వివాహం చేసుకున్నారు.. నందీశ్వరుడు చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ గా అలేఖ్య రెడ్డి పని చేయగా.. ఆ సమయంలో అలేఖ్య-తారకరత్న మధ్య ప్రేమ చిగురించింది.. అయితే, అలేఖ్యతో వివాహానికి తారకరత్న పేరెంట్స్ ఒప్పుకోలేదట. దీంతో ఆయన గుడిలో స్నేహితుల సమక్షంలో నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. పెళ్లైన కొన్నాళ్ల తర్వాత పేరెంట్స్ తారకరత్న-అలేఖ్యలను దగ్గరకు తీసుకున్నారు. తారకరత్న భార్య అలేఖ్యకు విజయసాయిరెడ్డి పెదనాన్న వరస అవుతారు. విజయసాయిరెడ్డి భార్య సునంద చెల్లెలు కూతురే అలేఖ్య.. కాబట్టి విజయసాయిరెడ్డి భార్య అలేఖ్యకు సొంత పెద్దమ్మ అవుతారన్నమాట. మొత్తంగా ఆ విధంగా విజయసాయిరెడ్డి.. నందమూరి కుటుంబానికి బంధువు అయ్యాడు.
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!