AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో రాగల కొన్ని గంటల్లో పలు ప్రాంతాల్లో వాతావరణంలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. ముఖ్యంగా రానున్న మూడు గంటల వ్యవధిలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పులు, అల్పపీడన ద్రోణి ప్రభావంతో తీరప్రాంతం, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షపాతం నమోదు కావచ్చని అధికారులు వెల్లడించారు.
రైతులు, వ్యవసాయ కార్మికులు, పశువుల కాపరులు వర్షం పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు లేదా ఓపెన్ గ్రౌండ్స్ లో నిలబడవద్దని సూచించారు. వర్ష సూచన ఉన్నందున సముద్రంలోకి వేటకు వెళ్లే మత్స్యకారులు తగిన అప్రమత్తత వహించాలి. ఉరుములు, మెరుపులు తీవ్రంగా ఉన్న సమయంలో ఇంట్లోని ఎలక్ట్రానిక్ పరికరాలను డిస్కనెక్ట్ చేయడం శ్రేయస్కరం. పొలాల్లో పనిచేసే కూలీలు పిడుగులు పడే ముప్పును గుర్తించి సురక్షితమైన కాంక్రీట్ భవనాలు లేదా సురక్షిత నివాసాలలో ఆశ్రయం పొందాలని విపత్తు నిర్వహణ సంస్థ ప్రజలను కోరింది.
Also Read
- Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
స్థానిక యంత్రాంగం , ఆయా జిల్లాల అధికారులు అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. నిరంతరం వాతావరణ మార్పులను గమనిస్తూ విపత్తు నిర్వహణ సంస్థ విడుదల చేసే ప్రకటనలకు అనుగుణంగా ప్రజలు నడుచుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. వర్షం తీవ్రత ఎక్కువగా ఉన్న సమయాల్లో చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు రాకుండా జాగ్రత్త పడాలని తెలిపారు.
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!