రఘురామకృష్ణరాజును డిస్‌క్వాలిఫై చేయండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు.. ఆ పార్టీకి కొరకరాని కొయ్యగా మారరు.. గతంలోనే రఘురామపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు వైసీపీ ఎంపీలు.. తాజాగా.. రఘురామకృష్ణరాజును డిస్‌క్వాలిఫై చేయండి అంటూ లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు వైసీపీ చీప్ విప్ మార్గాని భరత్.. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామకృష్ణరాజును వెంటనే డిస్‌క్వాలిఫై చేయాల్సిందిగా మరోసారి విజ్ఞప్తి చేశారు.. వైసీపీ టికెట్‌పై నర్సాపురం నుంచి ఎంపీగా ఎన్నికైన ఆయన.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని.. అందుకు రఘురామకృష్ణరాజు పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్పీకర్ ఓం బిర్లాను కలిసి కోరారు.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ రఘురామ చేసిన వ్యాఖ్యలపై గతంలోనే ఆధారాలను సమర్పించామని, అనేక పర్యాయాలు.. అనర్హత వేటుకు సంబంధించి స్పీకర్‌ను కలిసి విజ్ఞప్తి చేసినట్టు ఈ సందర్భంగా గుర్తుచేశారు మార్గాని భరత్. కాగా, తనపై నమోదైన రాజద్రోహం కేసులపై రోజుకు ఒకరిని అనే తరహాలో వరుసగా.. వివిధ రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లు, నేతలకు రఘురామకృష్ణరాజు లేఖలు రాస్తున్న సంగతి తెలిసిందే.
Also Read
తాజావార్తలు
-
UP Politics: అఖిలేశ్ ముందే ఎస్పీ నేతల బూతులు.. రెండు జిల్లా కమిటీలు రద్దు
-
RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో గణపయ్య సందడి.. క్యూలైన్లన్నీ ఫుల్.!
-
BJP: ‘‘కాంగ్రెస్ జోకర్ల పార్టీ’’.. రాహుల్ గాంధీపై బీజేపీ ఫైర్..
-
The Paradise: అనిరుధ్ స్టూడియో నుంచి నాని ‘చిన్న లీక్’.. ‘ది ప్యారడైజ్’ 3rd సింగిల్‌పై క్రేజీ వీడియో వైరల్! చూశారా
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!