వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ నేత, నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి… త్వరలోనే ఎంపీ పదవికి రాజీనామా చేస్తాననే ఈ మధ్యే ప్రకటించిన ఆయన.. ఇప్పుడు తాను పవన్ కల్యాణ్ ఫ్యాన్‌ను అంటూ కామెంట్లు చేసి కొత్త చర్చకు తెరలేపారు.. ఇవాళ ఉదయం హైదరాబాద్ గచ్చిబౌలిలోని రఘురామ కృష్ణరాజు ఇంటికి వచ్చిన ఏపీ సీఐడీ అధికారులు.. ఆయనకు నోటీసులు ఇచ్చి వెళ్లిపోయారు.. ఆ తర్వాత మీడియాతో…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజుకు ఇవాళ నోటీసులు అందజేశారు ఏపీ సీఐడీ అధికారులు… గతంలో ఆయనపై నమోదైన కేసులకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో సీఐడీ అధికారులు రఘురామ కృష్ణరాజుపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది.. రఘురామకృష్ణరాజుపై 124(A), 153(B), 505 IPC, 120(B) సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సీఐడీ.. ఇవాళ హైదరాబాద్ గచ్చిబౌలిలోని రఘురామ ఇంటికి వచ్చి…
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబల్ నేత, నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇంటికి మరోసారి వెళ్లారు ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు.. హైదరాబాద్ గచ్చిబౌలిలోని రఘురామ ఇంటికి వెళ్లారు ఏపీ సీఐడీ అధికారులు.. గతంలో రఘురామను విచారించిన సీఐడీ, ఆ తర్వాత ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే కాగా.. మరోసారి సీఐడీ పోలీసుల విచారణకు రావాలని రఘురామకృష్ణరాజుకు నోటీసులు ఇచ్చేందుకే వచ్చినట్టుగా చెబుతున్నారు.. రేపు సీఐడీ విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు ఇవ్వనున్నట్టుగా సమాచారం.. మరి సీఐడీ నోటీసుల్లో ఏముందో..?…
శీతాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. ఏపీలో ఆర్థిక పరిస్థితి అస్థవ్యస్థంగా ఉందని ఆయన లోక్ సభలో ప్రస్తావించారు. ఏపీలో రుణాల కోసం ప్రభుత్వ ఆస్తులను వైసీపీ ప్రభుత్వం తాకట్టు పెడుతోందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా ఉద్యోగులకు కార్పొరేషన్ల పేరుతో రుణాలు తీసుకుంటున్నారని రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వం ఏపీలో ఆదాయం సృష్టించే మార్గాలను మరిచి రుణాలపైనే ఆధారపడుతోందని ఆయన…
ఏపీలో నెలకొన్న పరిస్థితులపై రాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రికి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖలు రాశారు. టీడీపీ కార్యాలయంపై దాడులను ఖండిస్తూ ఆయన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిషా లకు లేఖలు రాశారు. ఈ దాడులపై విచారణ చేపట్టేందుకు సీబీఐ, ఎన్‌ఐఏలను రంగంలోకి దించాలని కోరారు. అంతేకాకుండా ఇలానే ఉంటే ఏపీ పరిస్థితులు మరింత దిగజారిపోతాయన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పోలీసులపై నమ్మకం పోయిందని, వెంటనే కేంద్ర బలగాలను రాష్ట్రంలో దించాలని…
వైసీపీ రెబల్ నేత, ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారం ఇంకా హాట్ టిపిక్‌గానే సాగుతోంది.. ప్రభుత్వంపై ఆరోపణలు, కేసులు, అరెస్ట్, జైలు, ఆస్పత్రి, బెయిల్, ఫిర్యాదులు.. ఇలా కొనసాగుతూనే ఉంది.. ఇక, కాసేపటి క్రితమే లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాతో సమావేశమయ్యారు ఎంపీ రఘురామకృష్ణరాజు… తనపై దాడి విషయంలో.. ప్రివిలేజ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసిన ఆయన.. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.. ఇక, వైసీపీ వెబ్‌సైట్‌లో తన పేరును తొలగించడాన్ని ఎంపీ రఘురామ ప్రస్తావించారు.…
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు.. ఆ పార్టీకి కొరకరాని కొయ్యగా మారరు.. గతంలోనే రఘురామపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు వైసీపీ ఎంపీలు.. తాజాగా.. రఘురామకృష్ణరాజును డిస్‌క్వాలిఫై చేయండి అంటూ లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు వైసీపీ చీప్ విప్ మార్గాని భరత్.. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామకృష్ణరాజును వెంటనే డిస్‌క్వాలిఫై చేయాల్సిందిగా మరోసారి విజ్ఞప్తి చేశారు.. వైసీపీ టికెట్‌పై నర్సాపురం నుంచి ఎంపీగా ఎన్నికైన…