తెలుగుదేశం పార్టీ.. తెలుగు దొంగల పార్టీగా మారింది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్… ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలుగుదేశం పార్టీ.. తెలుగు దొంగల పార్టీగా మారింది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. కొండపల్లి మైనింగ్ పై తెదేపా నేత పట్టాభి ఆరోపణలను ఖండించిన ఆయన.. అబద్దాలను నిజం చేయాలని తెదేపా నేతలు, పట్టాభి ప్రయత్నాలు చేస్తున్నారని.. లోయ గ్రామంలో లేని 143 సర్వే నెంబర్ ను వైఎస్ హయాంలో సృష్టించారని పట్టాభి ఆరోపించారని.. 1993లో ఒక వ్యక్తి దరఖాస్తు చేసుకోగా 143 సర్వే నెంబర్ పై లీజును మైనింగ్ శాఖ అధికారులు మంజూరు చేశారని.. 1943-44లో రూపొందించిన ఆర్ఎస్ఆర్ రికార్డులోనూ 143 సర్వే నెంబర్ ఉంది..143 సర్వే నెంబర్ ఎప్పట్నుంచో ఉందనడానికి ఆధారాలు ఉన్నాయన్నారు.
వైఎస్ హయాంలో 143 సర్వే నెంబర్ ను సృష్టించారని పట్టాభి ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు వసంత కృష్ణప్రసాద్.. 45 ఏళ్లుగా ఆ ప్రాంతంలో మైనింగ్ జరుగుతోంది… అక్కడ అన్ని సదుపాయాలు కల్పించారు.. నా పై బురదజల్లడమే లక్ష్యంగా దేవినేని ఉమా.. ఏడాదిన్నరగా పనిచేస్తున్నారని మండిపడ్డారు.. నేను పదో తరగతి వరకే చదివానని పట్టాభి అంటున్నారు. ఈ విషయాన్ని ఎన్నికల అఫిడవిట్ లోనూ నేను స్పష్టం చేశానన్న ఆయన.. ఎన్టీఆర్ పెట్టిన తెదేపాను లోకేష్ పునాదులతో సహా పెకలిస్తారని.. తెదేపా బ్రోకర్ల పార్టీగా తయారైంది అంటూ హాట్ కామెంట్లు చేశారు.. గ్రాఫిక్స్ లు చూసి అమెరికాలో ఉన్నవారూ అమరావతిలో కోట్లు పోసి నష్టపోయారని విమర్శించిన కృష్ణప్రసాద్.. రాజధాని అమరావతిలో రోడ్లను ప్రభుత్వమే తవ్విస్తుందనే ఆరోపణలను ఖండించారు.. రాజధానిలో రోడ్లను ఎక్కడైనా ప్రభుత్వం తవ్విస్తుందా? అని ప్రశ్నించారు.
Also Read
- Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
- OTR : Thopudurthi Prakash Reddy ఉక్కిరి బిక్కిర అవుతున్నారా? దిక్కుతోచల స్థితిలో ఉన్నారా..?
- OTR : రెంటికి చెడ్డ రేవడిలా యనమల కృష్ణుడు రాజకీయ జీవితం?
- Annadata Sukhibhava Status : మీ అకౌంట్లో రూ.7,000 పడ్డాయా? ఆధార్‌తో ఇలా చెక్ చేయండి
తాజావార్తలు
-
RCB vs GT : గుజరాత్‌పై ఆర్సీబీ ‘రాయల్’ విక్టరీ.. ఏకంగా 92 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోకి..!
-
OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
-
Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్‌బై చెప్పనున్న సిద్ధరామయ్య!
-
Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్‌ను లేపేసిన కిల్లర్స్!
-
Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!