Blood Pressure Readings: బీపీ ఎక్కువా? తక్కువా?.. అసలు బీపీ రీడింగ్స్ అర్థం ఏమిటో తెలుసా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Blood Pressure Readings: రక్తపోటు (బ్లడ్ ప్రెజర్) ప్రతి ఒక్కరూ తరచూ పరీక్షించుకునే ఆరోగ్య సూచికల్లో ఒకటి. అయితే బీపీ రీడింగ్‌లో కనిపించే సంఖ్యలు అసలు ఏమి సూచిస్తాయో చాలామందికి పూర్తిగా తెలియదు. అయితే, బీపీ రీడింగ్స్ గుండె ఆరోగ్యంపై ఎలా ప్రభావం చూపుతాయో వివరిస్తున్నారు వైద్యులు..
వైద్యుల ప్రకారం
*118/76 బీపీ సాధారణ స్థాయిగా పరిగణించవచ్చు. ఈ స్థాయిలో రక్తనాళాలపై ఒత్తిడి చాలా తక్కువగా ఉండి, గుండె ఎక్కువ శ్రమపడాల్సిన అవసరం ఉండదు.
Also Read
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
* 136/88 రీడింగ్ వచ్చినప్పుడు జాగ్రత్తలు ప్రారంభించాల్సిన సమయం అని తెలిపారు. ఈ దశలో నిద్ర, ఒత్తిడి, మద్యం సేవించడం, శరీర బరువు, శారీరక వ్యాయామం వంటి అంశాలను పరిశీలించాలని సూచించారు. చిన్న జీవనశైలి మార్పులు కూడా ఈ దశలో పెద్ద ప్రయోజనాన్ని అందిస్తాయని చెప్పారు.
* 148/92 స్థాయికి చేరుకుంటే రక్తనాళాలపై ప్రభావం ప్రారంభమవుతుందని వివరించారు. దీర్ఘకాలంలో రక్తనాళాలు గట్టిపడటం, కొవ్వు పేరుకుపోవడం, గుండెపై అదనపు ఒత్తిడి పెరగడం వంటి సమస్యల ప్రమాదం అధికమవుతుందని హెచ్చరించారు.
* 162/100 రీడింగ్ వస్తే పరిస్థితిని నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. ఈ స్థాయిలో గుండె ప్రతి నిమిషం అధిక శ్రమ చేయాల్సి వస్తుందని, గుండెపోటు, పక్షవాతం (స్ట్రోక్), మూత్రపిండాల వ్యాధుల ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని తెలిపారు.
అయితే ఒక్కసారి బీపీ కొలిచిన రీడింగ్ ఆధారంగా నిర్ణయం తీసుకోవద్దని చెబుతున్నారు వైద్యులు.. రోజంతా బీపీ మారుతూ ఉండటం సహజమని చెప్పారు. అందుకే ఇంట్లోనే ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఒకే సమయానికి కొన్ని రోజుల పాటు బీపీని కొలిచి, వచ్చిన రీడింగ్స్ సగటును పరిశీలించాలని సూచించారు. ఆ సగటు విలువ ఆధారంగానే గుండెపై ఎంత ఒత్తిడి పడుతోందో స్పష్టంగా అంచనా వేయవచ్చని వివరించారు. అయితే, ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. మీ బీపీ తరచూ ఎక్కువగా వస్తే లేదా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం ఎంతో మేలు చేస్తుంది..
తాజావార్తలు
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!